3 నుంచి 15-18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన
ABN , First Publish Date - 2022-01-01T05:25:28+05:30 IST
కొవాక్సిన టీకా జనవరి 3వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి టీకా వేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) మనజీర్ జిలాని సామూన అన్నారు.

జాయింట్ కలెక్టర్ మనజీర్ జిలాని సామూన
కర్నూలు(కలెక్టరేట్), డిసెంబరు 31: కొవాక్సిన టీకా జనవరి 3వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి టీకా వేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) మనజీర్ జిలాని సామూన అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స హాలు నుంచి విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు తప్పకుండా టీకా వేయించాలన్నారు. 3న అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా లో 2.39లక్షల మంది పిల్లలు ఉన్నారన్నారు. వీరిలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న వారు అధికంగా ఉన్నారన్నారు. ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాళ్లు, విద్యార్థులకు కొవిడ్ టీకాపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఈవో రంగారెడ్డి, సమగ్ర శిక్ష అదనపు పథక సంచాలకుడు కె.వేణుగోపాల్, ఎస్‌ఎస్‌ఏ ఏపీవో విద్యాసాగర్, జిల్లా ఇమ్యూనైజేషన అధికారి డా.విశ్వేశ్వరరెడ్డి, ఆర్‌ఐవో శంకర్ నాయక్ పాల్గొన్నారు.