ఉర్దూ వర్సిటీ డిగ్రీ, పీజీ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2021-10-30T05:17:01+05:30 IST

డాక్టర్‌ అబ్బుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ డిగ్రీ మొదటి, పీజీ-4, 6వ సెమిస్టర్‌ ఫలితాలను రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బాయినేని శ్రీనివాసులు శుక్రవారం విడుదల చేశారు.

ఉర్దూ వర్సిటీ డిగ్రీ, పీజీ ఫలితాలు విడుదల

కర్నూలు (అర్బన్‌), అక్టోబరు 29: డాక్టర్‌ అబ్బుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ డిగ్రీ మొదటి, పీజీ-4, 6వ సెమిస్టర్‌ ఫలితాలను రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బాయినేని శ్రీనివాసులు శుక్రవారం విడుదల చేశారు. ఇన్‌చార్జి కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ డాక్టర్‌ జేఎండీ షఫీతో కలిసి ఆయన ఫలితాలను ప్రకటించారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌లో 51 శాతం, పీజీ నాలుగో సెమిస్టర్‌లో 80 శాతం, ఆరో సెమిస్టర్‌లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు అయిందని రిజిస్ట్రార్‌ తెలిపారు. కొవిడ్‌ విపత్తులోనూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రణాళికాబద్ధంగా పరీక్షలు నిర్వహించి, ఫలితాలను సకాలంలో విడుదల చేశామని తెలిపారు. 

Updated Date - 2021-10-30T05:17:01+05:30 IST