ఉపాఽధి పనులను అడ్డగించిన రైతులు

ABN , First Publish Date - 2021-05-20T06:27:40+05:30 IST

ఉపాధి కూలీలను కొందరు రైతులు అడ్డగించారు.

ఉపాఽధి పనులను అడ్డగించిన రైతులు

  1. హసీల్దారుకు వినతిపత్రం ఇచ్చిన సర్పంచ్‌


కోవెలకుంట్ల, మే 19: ఉపాధి కూలీలను కొందరు రైతులు అడ్డగించారు. ఈ ఘటన మండలంలోని సౌదరదిన్నెలో  జరిగింది. గ్రామానికి  చెందిన ఉపాధి కూలీలకు  సర్వేనంబరు 1/1లో 58 ఎకరాల బంజరు భూమిలో ఉపాఽధి పనులు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ సర్వేనంబరులోని కొంత పొలాన్ని కొందరు రైతులు  ఆక్రమించుకున్నారు. వారు వచ్చి ఇక్కడ ఉపాధి పనులు చేయరాదని కూలీలను అడ్డగించారు. దీంతో  కూలీలు గ్రామ సర్పంచ్‌ మధుసూదన్‌రెడ్డిని కలిసి తమకు ఉపాధి పని కల్పించాలని విన్నవించారు. దీంతో సర్పంచ్‌ తహసీల్దారు పుష్పకుమారిని కలిసి వినతిపత్రం అందించి గ్రామంలో ఉపాధి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  

Updated Date - 2021-05-20T06:27:40+05:30 IST