చెట్టుకు ఉరి వేసుకున్నాడు

ABN , First Publish Date - 2021-02-06T05:16:48+05:30 IST

మండలంలోని తంగడంచ గ్రామ సమీపంలోని మండ్లెం పొలిమేరలో ఓ పొలంలోని వేపచెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకున్నాడు.

చెట్టుకు ఉరి వేసుకున్నాడు

జూపాడుబంగ్లా, ఫిబ్రవరి 5: మండలంలోని తంగడంచ గ్రామ సమీపంలోని మండ్లెం పొలిమేరలో ఓ పొలంలోని వేపచెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకున్నాడు. ఎస్‌ఐ తిరుపాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని, గత నాలుగైదు రోజుల కిందట ఆత్మహత్యకు పాల్పడటంతో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉందని ఆయన తెలిపారు. ఒంటిపై లైన్స్‌ కలిగిన తెల్లచొక్క ఉందని, కాలర్‌పై కర్నూలు పట్టణానికి చెందిన టైలర్‌ కుట్టినట్లు మాత్రమే గుర్తులు ఉన్నాయని, అతని బ్లూకలర్‌ పంచతోనే ఉరివేసుకున్నట్లు గుర్తించామని తెలిపారు. అక్కడే పోస్టుమార్టం చేయించి, మండ్లెంలో దహనసంస్కారాలు చేయించామని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-02-06T05:16:48+05:30 IST