‘అనుమతి లేని చర్చిని తొలగించాలి’

ABN , First Publish Date - 2021-12-31T05:41:39+05:30 IST

మండలంలోని కొట్టాలచెరువు గ్రామంలో అనుమతి లేకుండా చర్చిని నిర్మిస్తున్నారని, దాన్ని తొలగించాలని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్‌, సహాయ కార్యదర్శి రవినాయక్‌, విశ్వహిందూ పరిషత్‌ ఆత్మకూరు ప్రఖండ కార్యాధ్యక్షుడు గరుడాద్రి సుదర్శన్‌ పేర్కొన్నారు.

‘అనుమతి లేని చర్చిని తొలగించాలి’

ఆత్మకూరు, డిసెంబరు 30: మండలంలోని  కొట్టాలచెరువు గ్రామంలో అనుమతి లేకుండా చర్చిని నిర్మిస్తున్నారని, దాన్ని తొలగించాలని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్‌, సహాయ కార్యదర్శి రవినాయక్‌, విశ్వహిందూ పరిషత్‌ ఆత్మకూరు ప్రఖండ కార్యాధ్యక్షుడు గరుడాద్రి సుదర్శన్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కొట్టాలచెరువు గ్రామస్థులతో కలిసి వారు ధర్నా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గిరిజనుల నివాసాల మధ్య ప్రభుత్వ స్థలంలో చర్చి నిర్మాణం చేపట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.   Updated Date - 2021-12-31T05:41:39+05:30 IST