ఏకగ్రీవంగా గొర్రెల పెంపకందారుల సంఘం ఎన్నిక
ABN , First Publish Date - 2021-10-30T04:06:19+05:30 IST
మండల పరిధిలోని వేల్పనూరు గ్రామంలో శుక్రవారం గొర్రెల పెంపకదారుల సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.

ఆత్మకూరు(వెలుగోడు), అక్టోబరు 29: మండల పరిధిలోని వేల్పనూరు గ్రామంలో శుక్రవారం గొర్రెల పెంపకదారుల సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయ ఆవరణలో వెటర్నరీ ఏడీ ధనుంజయ నేతృతంలో జరిగిన ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సహకార సంఘం అధ్యక్షుడిగా మిడ్డూరు పుల్లయ్య, కార్యవర్గ సభ్యులుగా పాలమర్రి పరమేశ్వరుడు, పారుమంచాల వెంకటరమణ, చెరకుచెర్ల రామసుబ్బయ్య, సుద్దుల నడిపి మద్దిలేటి, బూజనూరు మద్దిలేటిలను గొర్రెల పెంపకందారులు ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏడీ ధనుంజనుడు ఎన్నికైన వారికి డిక్లరేషన పత్రాలను అందజేసి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గొర్రెల పెంపకంలో భాగంగా ప్రవేశపెట్టే పథకాలను లబ్ధిదారులకు అందజేసేలా సహకార సంఘం కమిటీ చొరవ తీసుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఆయా పథకాల గురించి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు సుధాకరరెడ్డి, జోత్స్నాదేవి, సిబ్బంది ఉన్నారు.