ఏకగ్రీవ పంచాయతీలు

ABN , First Publish Date - 2021-02-05T05:42:31+05:30 IST

పలు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

ఏకగ్రీవ పంచాయతీలు

నంద్యాల, ఫిబ్రవరి 4: పలు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. నంద్యాల మండలంలో 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గుంతనాల సర్పంచ్‌గా గాలి సరోజ, చాపిరేవుల సర్పంచ్‌గా బోయరేవుల దేవి, పోలూరు సర్పంచ్‌గా పొన్నపాటి ప్రతాప్‌, బ్రహ్మాణపల్లె సర్పంచ్‌గా అన్నపురెడ్డి సుబ్బమ్మలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 17 గ్రామ పంచాయతీల్లో 4 ఏకగ్రీవం కావడంతో మిగతా 13 గ్రామ పంచాయతీలకు ఈనెల 9వ తేదీన పోలింగ్‌ జరగనుంది.


గోస్పాడు: మండలంలో ఉన్న 15 గ్రామ పంచాయతీల్లో ఐదు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఐదు పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ఎం. కృష్ణాపురం నుంచి వై.కోటేశ్వరరెడ్డి, ఎస్‌.నాగులవరం నుంచి వంగూరి లక్ష్మీకాంతమ్మ, జూలేపల్లె నుంచి ఎం.పుల్లయ్య, దీబగుంట్ల నుంచి గంగవరం శివమ్మ, ఎం.చింతకుంట్ల నుంచి వి మల్లేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

దొర్నిపాడు: మండలంలో 11 గ్రామ పంచాయతీలకు గాను 5 ఏకగ్రీవమైనట్లు ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ఈవోపీఆర్డీ నాగ అనసూయ తెలిపారు. కొండాపురం, రామచంద్రాపురం, అమ్మిరెడ్డినగర్‌, గుండు పాపల, డబ్ల్యూ.కొత్తపల్లె గ్రామాల అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారని తెలిపారు. దొర్నిపాడు, బుర్రారెడ్డిపల్లె, చాకరాజువేముల, డబ్ల్యూ.గోవిం దిన్నె, క్రిష్టిపాడు, అర్జునాపురం గ్రామాలకు 20 మంది బరిలో ఉన్నారని, 67 వార్డు మెంబర్లకు 140 మంది బరిలో నిలిచారని వారు తెలిపారు. 


శిరివెళ్ల: మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు గాను జీనేపల్లె, కామినేనిపల్లె, వనికెందిన్నె పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి సాల్మన్‌ గురువారం తెలిపారు. దీంతో 13 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 13 పంచాయతీల్లో 34 మంది సర్పంచు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కామినేనిపల్లె గ్రామ సర్పంచ్‌గా మేరువ చిన్న నరసింహారెడ్డి, జీనేపల్లె సర్పంచ్‌గా దగడ మహేశ్వరి, వనికెందిన్నె సర్పంచ్‌గా తలారి సుబ్బలక్ష్మమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామాల్లోని వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవమయ్యారు. గంగవరం గ్రామంలోని 10 వార్డులు ఉండగా అన్నీ ఏకగ్రీవం అయ్యాయి. సర్పంచ్‌ స్థానానికి మాత్రం పోటీ నెలకొంది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌ అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు డిక్లరేషన్‌ పత్రాలు అందజేశారు. 


చాగలమర్రి: మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో 5 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. బ్రాహ్మణపల్లె సర్పంచ్‌గా నేట్ల మహేశ్వరి, గొట్లూరు సర్పంచ్‌గా లక్కిరెడ్డి శ్రీలత, డి.వనిపెంట సర్పంచ్‌గా రేనాటి బాలిశ్వర్‌రెడ్డి, కలుగొట్లపల్లె సర్పంచ్‌గా ఈదుల దస్తగిరిరెడ్డి, కేపీ తండా సర్పంచ్‌గా మూడే లక్ష్మీబాయి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 


సంజామల: సంజామల మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నొస్సం గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి నాగకుమార్‌ గురువారం తెలిపారు. మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా 16 గ్రామ పంచాయతీల్లో పోటీ ఉందని తెలిపారు. నొస్సం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఒకే ఒక్క వ్యక్తి గూటం పెద్దకంబయ్య నామినేషన్‌ వేయడంతో సర్పంచ్‌గా పెద్దకంబయ్యను ఎన్నికైనట్లు తెలిపారు. 

 

ఆత్మకూరు(వెలుగోడు): వెలుగోడు మండలంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆరు గ్రామాల్లో మొత్తం 24 మంది బరిలో నిలిచినట్లు ఎంపీడీవో అమానుల్లా గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రేగడగూడూరు గ్రామంలో దర్గా రజియాబి, మాధవరం గ్రామంలో బ్రహ్మానందరెడ్డి ఆయా గ్రామాల్లో వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే వేల్పనూరులో 3, వెలుగోడులో 7, మోతుకూరులో 3, గుంతకం దాలలో 4, బోయరేవులలో 3, అబ్దుల్లాపురంలో 4 చొప్పున అభ్యర్థులు సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కాగా వార్డు సభ్యుల ఎన్నికలకు మండలంలో 23 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.

 

బండి ఆత్మకూరు: మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవం చేసుకున్నారు. గురువారం నామినేషన్ల విత్‌డ్రాలు ముగియటంతో 13 గ్రామాల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు మండల ఎన్నికలఅధికారి వాసుదేవగుప్త తెలిపారు. ఏకగ్రీవంగా చిన్నదేవళాపురం ఆవులపాటి మధు, వెంగళరెడ్డి పేట పల్లె నాగమణి, కాకనూరు నర్ల సుబ్బారెడ్డి, సోమయాజులపల్లె లక్కబోయిన లావణ్య, పార్నపల్లె షేక్‌ షబ్బీర్‌ అహమ్మద్‌, ఈర్నపాడు దొర్నిపాటి వెంకట లక్ష్మమ్మ, రామాపురం బింగి పుల్లయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు.

 

ఆత్మకూరురూరల్‌: ఆత్మకూరు మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు గాను మూడు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. కొట్టాల చెరువు నుంచి ఉడుతల నాగలక్ష్మి, సిద్ధాపురం నుంచి పీట్ల వెంకటరమణ, అమలాపురం నుంచి మధుబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎంపీడీవో మోహన్‌కుమార్‌ వెల్లడించారు. మిగతా 13 గ్రామ పంచాయతీల నుంచి 37 మంది స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉన్నట్లు ఎంపీడీవో తెలిపారు.


అవుకు: మండలంలోని అన్నవరం, రామవరం, ఉప్పలపాడు, జూనుంతల, కొండమనాయునిపల్లె, చెన్నంపల్లె పంచాయతీల సర్పంచ్‌ స్థానాలకు ఒకే నామినేషన్‌ దాఖలయ్యాయి. దీంతో నామినేషన్ల ప్రకియ ముగిసే రోజుకు 6 పంచాయతీల్లోని అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


రుద్రవరం: రుద్రవరం మండలంలో 21 పంచాయతీలు ఉండగా కొండమాయపల్లె, ఎర్రగుడిదిన్నె పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అసిస్టెంట్‌ జిల్లా ఎలక్షన్‌ అథారిటీ ఆఫీసర్‌ వరలక్ష్మి గురువారం తెలిపారు. 19 పంచాయతీలకు గాను 56 మంది సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. 204 వార్డులకు గాను 41 వార్డులు ఏకగ్రీవం కాగా, ఇద్దరు విత్‌డ్రా చేసుకున్నారు. మొత్తం 161 వార్డులకు 359 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని అధికారి తెలిపారు. 

ఆళ్లగడ్డ: నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 104 గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ ముగిసేరోజుకు 27 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన 77 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆళ్లగడ్డ మండలంలో 17 పంచాయతీలకు గాను 3 స్థానాలు ఏకగ్రీవమైనట్లు తెలిపారు.


ఉయ్యాలవాడ: మండలంలో జరిగే పంచాయతీ ఎన్నికల బరిలో 10 గ్రామాలు బరిలో నిలిచాయని ఈవోపీఆర్డీ పాపారాయుడు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 20 గ్రామ పంచాయతీలు ఉండగా 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న 10 గ్రామ పంచాయతీల నుంచి 26 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ఆయన తెలిపారు. మండలంలో 170 వార్డులకు గాను ఆయా గ్రామాల్లోని 82 మంది ఎకగ్రీవంగా ఎన్నిక కాగా మరో 88 వార్డులకు గాను 308 మంది బరిలో ఉన్నారని ఆయన తెలిపారు. రూపనగుడి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌గా దేశం సోమశేఖర్‌రెడ్డి ఏకగ్రావంగా ఎన్నిక కాగా, గోవిందపల్లెలో చామల ఉమాదేవి, సర్వాయిపల్లెలో సరాబు ఉమ, ఇంజేడులో జైనాబీ, సుద్దమల్లలో రామ మద్దిలేటిరెడ్డి, పడిగుపాడులో దూదెకుల అసానమ్మ, హరివరంలో ఇల్లూరి నడిపి వెంకట, ఆర్‌.పాంపల్లెలో చాబోలి లక్ష్మీదేవి, ఉయ్యాలవాడలో మేకల ఓబులేసు, ఆర్‌.జంబులదిన్నెలో మొలక ప్రసాద్‌లు ఏకగ్రావంగా ఎన్నికయ్యారు. 


ఓర్వకల్లు: మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు గాను రెండు గ్రామ పంచాయితీలకు ఏకగ్రీవమయ్యాయి. 20 గ్రామ పంచాయతీలకు 128 మంది సర్పంచ్‌ అభ్యర్థులుగా నామినేషన్‌ వేశారు. వార్డు మెంబర్లు 220 ఉండగా, 498 మంది వార్డు సభ్యులుగా నామినేషన్‌ దాఖలు చేశారు. పాలకొలను, చింతలపల్లె గ్రామ పంచాయతీ సర్పంచులుగా ఒకే నామినేషన్‌ వేయడంతో ఆ ఇద్దరు సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


మహానంది: మండలంలోని 13 గ్రామపంచాయ తీలకు గాను  మూడు గ్రామపంచాయితీలకు సర్పంచ్‌లు ఏకగ్రీవం అయినట్లు అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ ఎన్నికల అఽథారిటీ అధికారి సుబ్బరాజు తెలిపారు. ఇందులో సీతారామపురం గ్రామపంచాయతీకి సర్పంచ్‌గా బుడ్డారెడ్డి తేజస్వినిరెడ్డి, మహానంది సర్పంచ్‌గా చలం శిరీష, కొత్తగా ఏర్పడ్డ అల్లీనగరం గ్రామపంచాయతీకి మద్దుల లక్ష్మీదేవి ఏకగ్రీవం అయినట్లు తెలిపారు. 140 వార్డు మెంబర్‌ స్థానాల్లో 37 ఏకగ్రీవం అయ్యాయని చెప్పారు. ఇందులో మహానంది గ్రామ పంచాయతీలోని 12వార్డు మెంబర్లతో పాటు సీతారామపురం -10, అల్లీనగరం పంచాయతీలోని 10 వార్డుమెంబర్‌ స్థానాలు, బుక్కాపురంలో 1 వార్డుమెంబర్‌ స్థానం, యు. బొల్లవరంలో 4 వార్డు మెంబర్‌ స్థానాల అభ్యర్థులు ఏకగ్రీవం అయినట్లు తెలిపారు. ఏకగ్రీవం అయిన ముగ్గురు సర్పంచ్‌ అభ్యర్థులు అధికారపార్టీ బలపరిచిన వారే. కాగా మండలంలో మిగిలిన 10 పంచాయతీల సర్పంచ్‌ స్థానాలకు 26 మంది, 103 వార్డు మెంబర్‌ స్థానాలకు 204 మంది పోటీలో ఉన్నారు.

Updated Date - 2021-02-05T05:42:31+05:30 IST