ఉగాది ఉత్సవాల పోస్టర్ విడుదల
ABN , First Publish Date - 2021-04-09T06:37:59+05:30 IST
నందవరం చౌడేశ్వరీమాత సన్నిధిలో జరిగే ఉగాది వార్షికోత్సవ పోస్టర్‌ను ఆలయ చైర్మన్ పీఆర్ వెంకటేశ్వరరెడ్డి గురువారం విడుదల చేశారు.
బనగానపల్లె, ఏప్రిల్ 8: నందవరం చౌడేశ్వరీమాత సన్నిధిలో జరిగే ఉగాది వార్షికోత్సవ పోస్టర్‌ను ఆలయ చైర్మన్ పీఆర్ వెంకటేశ్వరరెడ్డి గురువారం విడుదల చేశారు. ఆలయం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆలయ సిబ్బంది, పూజారులు, ఆలయకమిటీ సభ్యులు పోస్టర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనెల 13వతేదీ నుంచి 19వతేదీ వరకు నందవరం చౌడేశ్వరీమాత జ్యోతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈవో రామానుజన్, సిబ్బంది సహకారంతో భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.