బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-05-21T05:06:28+05:30 IST

తంచెర్ల - డోన్‌ రహదారిలోని రవిశంకర్‌ ఫ్యాక్టరీ ఎదురుగా గురువారం రెండు మోటారుసైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

బేతంచెర్ల, మే 20: బేతంచెర్ల - డోన్‌ రహదారిలోని రవిశంకర్‌ ఫ్యాక్టరీ ఎదురుగా గురువారం రెండు మోటారుసైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. గూటుపల్లె గ్రామానికి చెందిన మధుశేఖర్‌ నాపరాళ్ల ఫ్యాక్టరీని లీజుకు తీసుకొని నడుపుకుంటున్నాడు. మధుశేఖర్‌ గూటుపల్లె నుంచి ఫ్యాక్టరీకి వెళ్తుండగా బేతంచెర్లకు చెందిన హరిప్రసాద్‌ అనే వ్యక్తి ఎదురుగా వస్తుండగా బైకులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మధుశేఖర్‌ కుడిచేయికి, హరిప్రసాద్‌కు కుడి కాలికి గాయాలు కాగా బేతంచెర్ల ప్రభుత్వాస్పత్రిలో ప్రధమ చికిత్సలు చేయించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 


Updated Date - 2021-05-21T05:06:28+05:30 IST