పాణ్యంలో 20 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-02T06:13:50+05:30 IST

మండలంలో 20 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మద్దూరు వైద్యాధికారి డాక్టర్‌ భగవాన్‌దా్‌స తెలిపారు.

పాణ్యంలో 20 కరోనా కేసులు

పాణ్యం, మే 1 : మండలంలో 20 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మద్దూరు వైద్యాధికారి డాక్టర్‌ భగవాన్‌దా్‌స తెలిపారు. శనివారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా కేసుల వివరాలివి.. పాణ్యంలో 10, ఆలమూరులో 1, బలపనూరులో 1, భూపనపాడులో 1, గోనవరం లో 2, మద్దూరులో 2, నెరవాడలో 2, తొగర్చేడులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు. 


గడివేముల: మండలంలో 14  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వ వైద్యురాలు సృజన తెలిపారు. గడివేములలో 5, బిలకలగూడురులో 2, గడిగరేవులలో 2, పెసరవాయిలో 2, బూజనూరులో 1, కరిమద్దెల 1, తిరుపాడులో ఒకరికి  కరోనా వైరస్‌ సోకిందని అన్నారు. 


రుద్రవరం: మండలంలో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు టాస్క్‌ఫోర్స్‌ బృందం సభ్యులు వెంకటశివ, గాయత్రీ తెలిపారు. శనివారం రుద్రవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టాస్క్‌ఫోర్స్‌ బృందం సభ్యులు సమావేశమయ్యారు. రోజుకు 25 మంది నుంచి కరోనా శ్యాంపిల్‌ సేకరించాలని వైద్య సిబ్బందికి వారు ఆదేశించారు. మండలంలోని బీరవోలులో 3, చిన్నకంబలూరులో 2, రుద్రవరంలో 2, ఎల్లావత్తులలో 2, కోటకొండలో 1, నాగులవరంలో 1 కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. మాస్క్‌ లేకుండా బయటకు వస్తే రూ.100 జరిమానా విధించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి ఎంపీడీవో వరలక్ష్మి, వైద్యాధికారి రెడ్డికిషోర్‌, ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-02T06:13:50+05:30 IST