తూతూ మంత్రంగా ప్రజా వేదిక

ABN , First Publish Date - 2021-12-16T04:54:41+05:30 IST

మండలంలో ఉపాధి హామీ పనులపై జరిగిన సామాజిక తనిఖీల కోసం బుధవారం నిర్వహించిన ప్రజా వేదిక తూతూ మంత్రంగా ముగి సింది.

తూతూ మంత్రంగా ప్రజా వేదిక

  1.  నామమాత్రంగా సామాజిక తనిఖీలు 
  2.  కొంత మొత్తంలోనే రికవరీలు   

మహానంది, డిసెంబరు 15:  మండలంలో ఉపాధి హామీ పనులపై జరిగిన సామాజిక తనిఖీల కోసం బుధవారం  నిర్వహించిన  ప్రజా వేదిక తూతూ మంత్రంగా ముగి సింది. మహానంది మండలం ఎం. తిమ్మాపురంలోని ఎంపీడీవో కార్యా లయం ఆవరణలో నిర్వహించిన ప్రజావేదిక పారదర్శకంగా జరపలేద నే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.   మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వ హించిన   పనులపై  ఉపాధి సిబ్బంది సామాజిక తనిఖీలు నిర్వహించారు.  అయితే అధికార పార్టీ నేతల ఒత్తిడితో తనిఖీకి  వచ్చిన సిబ్బంది అంతా భేషుగ్గా ఉందని నివేదికలు తయారు చేసి ఉన్న తాధికారులకు సమర్పించినట్లు విమర్శలు వస్తున్నాయి.  ఎంపీడీవో సుబ్బరాజు ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఈ ప్రజావేదికకు మండలాధ్యక్షురాలు బుడ్డా రెడ్డి యశస్విని,  జిల్లా నీటి యాజమాన్యసంస్థ, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ అమర్‌నాథ్‌రెడ్డి ప్రెసిడింగ్‌ ఆఫీసర్‌గా, అదనపు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బాలకృష్ణారెడ్డి, సలీంబాషా, జిల్లా విజిలెన్స ఆఫీసర్‌ సిద్ధలింగమూర్తి హాజరయ్యారు. ఇందులో గోపవరం, ఈ. బొల్లవరం, అబ్బీపురం, తమ్మడపల్లి గ్రామాలకు రూ. 4 వేలు పెనాల్టీ కింద ప్రకటించారు. అలాగే అటవీ, డీఆర్‌డీఏ, వైకేపీ, హౌసింగ్‌, పంచాయతీ రాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖతో పాటు సమగ్ర శిక్షణ నుంచి  కేవలం రూ.1,67,359 రికవరీ చేయాలని ప్రజా వేదికలో అధికారులు ఆదేశించారు. జిల్లా స్థాయి  అధికారులు వేరే బృందంతో మరోసారి మహా నంది మండలంలో సామాజిక తనిఖీలు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.  

సామాజిక తనిఖీ ప్రకారం ప్రజావేదిక నిర్వహించాం: ఎంపీడీవో సుబ్బరాజు

మహానంది మండలంలోని గ్రామాల్లో జాతీయ గ్రామీణ హామీ పథకంలో భాగంగా జరిగిన ఉపాధి హామీపనులపై జిల్లాలోని ప్రత్యేక బృందం సామాజిక తనిఖీలు నిర్వహించాయి. అందులో వెలుగు చూసిన పనులకే రికవరీ చేయాలని నివేదికలను సమ ర్పించారు. ఆ మేరకు బుధవారం తిమ్మాపురంలో నిర్వహించిన ప్రజావేదికలో ఉపాధి పనులతో పాటు మిగతా శాఖల నుంచి రికవరీకి ఆదేశించాం. ఇందులో ఎలాంటి అధికార దుర్వినియోగం జరగలేదు.   


Updated Date - 2021-12-16T04:54:41+05:30 IST