‘విద్యార్థి నాయకులను బెదిరించడం తగదు’

ABN , First Publish Date - 2021-08-22T04:45:06+05:30 IST

విద్యార్థి నాయకులను పోలీసుల ద్వారా బెదిరించడం సరికాదని ఆర్‌పీఎస్‌ఎఫ్‌ డివిజన్‌ అధ్యక్షుడు చిన్న, జిల్లా నాయకుడు నాగప్ప అన్నారు.

‘విద్యార్థి నాయకులను బెదిరించడం తగదు’

ఆదోని (అగ్రికల్చర్‌), ఆగస్టు 21: విద్యార్థి నాయకులను పోలీసుల ద్వారా బెదిరించడం సరికాదని ఆర్‌పీఎస్‌ఎఫ్‌ డివిజన్‌ అధ్యక్షుడు చిన్న, జిల్లా నాయకుడు నాగప్ప అన్నారు. శనివారం ఆర్ట్స్‌ కళాశాల ఆవరణంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. డిగ్రీ కళాశాలల్లో హాస్టల్‌ ఫీజు తగ్గించాలని విద్యార్థి సంఘం నాయకుడు శ్రీరాములు యూనివర్సిటీ వీసీని డిమాండ్‌ చేస్తే ఆయన పోలీసుల ద్వారా బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై ఉన్నత అధికారులతో విచారణ జరిపించి వీసీని విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో హరీష్‌, రవి, నవీన్‌, విజయ్‌, మోహన్‌, చరణ్‌, ఉదయ్‌, చంటి పాల్గొన్నారు.

Updated Date - 2021-08-22T04:45:06+05:30 IST