గిరిజనులకు అటవీ హక్కులపై అవగాహన ఉండాలి: జడ్జి

ABN , First Publish Date - 2021-10-26T04:32:27+05:30 IST

గిరిజనులకు అటవీ హక్కుల చట్టాలపై అవగాహన ఉండాలని ఆత్మకూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజన ఉదయ్‌ ప్రకాష్‌ సూచించారు.

గిరిజనులకు అటవీ హక్కులపై అవగాహన ఉండాలి: జడ్జి
మాట్లాడుతున్న జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజన ఉదయ్‌ ప్రకాష్‌

కొత్తపల్లి, అక్టోబర్‌ 25:  గిరిజనులకు  అటవీ హక్కుల చట్టాలపై అవగాహన  ఉండాలని ఆత్మకూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజన ఉదయ్‌ ప్రకాష్‌ సూచించారు. సోమవారం కొత్తపల్లి గ్రామ శివార్లలో ఉన్న భ్రమరాంబ చెంచు గూడెంలో అటవీ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  గిరిజనులకు అటవీ చట్టాలు ఎంతవరకు అమలవుతున్నాయి, వారికి ఎంతవరకు అవి అమలు అవుతున్నాయి అనే వాటిపై వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి ఉన్న హక్కులకు న్యాయం జరుగకపోతే ఏం చేయాలి, స్థిర చరాస్థులను గిరిజనులు ఎలా కాపాడుకోవాలి అనే అంశాలను చెంచులకు వివరించారు. చెంచుల హక్కులను భంగం కలిగినపుడు న్యాయస్థానాలను ఆశ్రయించాలని కోరారు. అలాగే చెంచులు ప్రభుత్వం అందిస్థున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు.ఈ  కార్యక్రమంలో ఏపీపీ బాబు రాజేంద్ర ప్రసాద్‌, ఎస్‌ఐ ముబీనాతాజ్‌, న్యాయవాది బల రాం నాయక్‌, మండల న్యాయ సలహా కార్యదర్శి సురే్‌ష, నాయకులు మోహనయాదవ్‌లు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T04:32:27+05:30 IST