ట్రాక్టర్‌ బోల్తా: వలస కూలీ మృతి

ABN , First Publish Date - 2021-09-04T04:35:56+05:30 IST

గిద్దలూరు- నంద్యాల రహదారిలో శుక్రవారం ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది.

ట్రాక్టర్‌ బోల్తా: వలస కూలీ మృతి


మహానంది, సెప్టెంబరు 3:  గిద్దలూరు- నంద్యాల రహదారిలో శుక్రవారం  ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జార్ఘండ్‌ రాషా్ట్రనికి చెందిన వలస కూలీ ఘగ్గర్‌(47) మృతి చెందినట్లు ఎస్‌ఐ నాగార్జునరెడ్డి తెలిపారు. జార్ఘండ్‌ రాషా్ట్రనికి చెందిన వలస కూలీలు రుద్రవరం మండలం శ్రీరంగాపురం గ్రామంలో జీవపాధి కోసం ఇటీవల వచ్చారు. అయితే వచ్చిన పనులు పూర్తి కావడంతో శుక్రవారం తిరిగి తమ స్వగ్రామానికి  వెళ్లేందుకు ట్రాక్టర్‌లో నలుగురు  వలసకూలీలు ప్రకాశం జిల్లా గిద్దలూరులో రైలు ఎక్కేందుకు బయలు దేరారు. నల్లమల అటవీ ప్రాంతంలోని సర్వనరసింహాస్వామి ఆలయం వద్ద  ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఘగ్గర్‌ మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  


Updated Date - 2021-09-04T04:35:56+05:30 IST