నేటి నుంచి పగటి పూట కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-05T05:52:44+05:30 IST

ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నుంచి పగటి పూట కర్ఫ్యూ విధించనున్నట్లు పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, కమిషనర్‌ కిశోర్‌ మంగళవారం తెలిపారు.

నేటి నుంచి పగటి పూట కర్ఫ్యూ

ఆళ్లగడ్డ, మే 4: ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నుంచి పగటి పూట కర్ఫ్యూ విధించనున్నట్లు పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, కమిషనర్‌ కిశోర్‌ మంగళవారం తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలని వారు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని లేని పక్షంలో జరిమానా విధిస్తామని చెప్పారు. 

ఎక్కడి బస్సులు అక్కడే: ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.


రుద్రవరం: మండలంలో బుధవారం నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు తహసీల్దార్‌ వెంకటశివ మంగళవారం తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు కొనసాగించి మూసివేయాలని అన్నారు. గ్రామాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు. రాత్రి 10 గంటలైతే పూర్తిస్థాయిలో కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు చెట్ల కింద గుంపులు గుంపులుగా చేరవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని అన్నారు. మాస్క్‌ లేకుండా బయట తిరిగితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. 


చాగలమర్రి: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని తహసీల్దార్‌ చంద్రశేఖర్‌నాయక్‌ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని సూచించారు. ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని అన్నారు. 50 మంది మాత్రమే వివాహాలకు హాజరు కావాలని, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. 


ఉయ్యాలవాడ: కరోనా విజృంభణ దృష్ట్యా మండలంలో నిర్వహిస్తున్న రోజుకు 18 గంటల కర్ఫ్యూ సహకరించాలని ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. మంగళవారం బస్టాండ్‌ ఆవరణలో వ్యాపారులతో ఆయన మాట్లాడుతూ బుధవారం నుంచి రోజుకు 18 గంటల పాటు కర్ఫ్యూ నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు కొనసాగించాలన్నారు. 12 గంటల తరువాత మూసి వేయకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌, శానిటైజర్‌ తప్పక ధరించి, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఏఎస్‌ఐ రాంభూపాల్‌రెడ్డి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 


 వారతపు సంతలో మార్పు: మండల కేంద్రంలో ప్రతి బుధవారం సాయంత్రం జరిగే వారపు సంత బుధవారం నుంచి ఉదయం పూటే ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. గతంలో లాగా నడి ఊర్లో కాకుండా స్థానిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశామన్నారు. వ్యాపారులు భౌతిక దూరం పాటి స్తూ వ్యాపారాలు కొనసాగించాలని ఆయన తెలిపారు.


ఓర్వకల్లు: కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్‌ఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. మంగళవారం ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐతోపాటు తహసీల్దార్‌ శివరాముడు, ఎంపీడీవో శివనాగప్రసాద్‌ మాట్లాడుతూ కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రపంచాన్ని వణికిస్తోందని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. మాస్కు లేని వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. బుధవారం నుంచి మండలంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలని, ఆ తర్వాత అన్ని బంద్‌ చేయాలన్నారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందన్నారు. రెండు వారాల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు వారు తెలిపారు. హోటళ్ల యజమానులు హోటళ్లను పూర్తి స్థాయి లో మూసివేయాలన్నారు. దుకాణాల్లో అధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Updated Date - 2021-05-05T05:52:44+05:30 IST