రేపటి నుంచి ఆంక్షలు

ABN , First Publish Date - 2021-05-02T06:11:33+05:30 IST

కరోనా విజృంభిస్తుండడంతో బేతంచెర్ల పట్టణంలో సోమవారం నుంచి వ్యాపార దుకాణాలపై ఆంక్షలను అమలు చేస్తున్నట్లు అధికారులు నిర్ణయించారు.

రేపటి నుంచి ఆంక్షలు

బేతంచెర్ల, మే 1: కరోనా విజృంభిస్తుండడంతో బేతంచెర్ల పట్టణంలో సోమవారం నుంచి వ్యాపార దుకాణాలపై ఆంక్షలను అమలు చేస్తున్నట్లు అధికారులు నిర్ణయించారు. శనివారం బేతంచెర్ల పోలీస్‌స్టేషన్‌లో తహసీల్దారు విద్యాసాగర్‌, సీఐ కేశవరెడ్డి ఆధ్వర్యంలో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. బేతంచెర్లలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వ్యాపారులకు తెలిపారు. అనంతరం వ్యాపారుల అభిప్రాయాల తెలుసుకున్నారు. మే 3వ తేదీ నుంచి బేతంచెర్లలో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చికెన్‌ సెంటర్లు, కూల్‌డ్రింక్‌ షాపులు, నిత్యావసర, వస్త్ర, బంగారు, ఇతర వ్యాపార దుకాణాలకు అనుమతి ఉంటుందని, ఆ తరువాత వ్యాపార సంస్థలను మూసివేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దారు విద్యాసాగర్‌, సీఐ కేశవరెడ్డి హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఐ సురేష్‌, నగర పంచాయతీ కమీషనర్‌ రమేష్‌బాబు, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్‌ దస్తగిరిబాబు, వివిధ వ్యాపార దుకాణాల యజమానులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-02T06:11:33+05:30 IST