వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

ABN , First Publish Date - 2021-01-12T05:48:31+05:30 IST

జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో  ముగ్గురి దుర్మరణం

కర్నూలు, జనవరి 11: జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు నగరంలో ఇద్దరు, వెల్దుర్తి మండలంలోని ఎల్‌ నగరం గ్రామం వద్ద మరొకరు మృతి చెందారు.  కర్నూలులోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జయలక్ష్మి (59) అనే మహిళ దుర్మరణం చెందింది. స్థానిక రామచంద్రానగర్‌కు చెందిన ఈమెకు భర్త చనిపోయాడు. ముగ్గురు కొడుకులు. సోమ వారం సాయంత్రం సీ.క్యాంపులో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లింది. తిరిగి రాత్రి వస్తూ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద రోడ్డు దాటుతుండగా, డోన్‌ వైపు నుంచి ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపో యింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందిం ది. ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మి తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

 

- అలాగే తాలుకా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సంతోష్‌నగర్‌ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లూథర్‌ అనే యువకుడు దుర్మరణం చెందాడు. స్థానిక షరీన్‌న గర్‌కు చెందిన లూథర్‌ కార్పెంటర్‌ పని చేస్తుంటాడు. సోమవారం తన మిత్రుడు అశోక్‌, మరో యువకునితో కలిసి మోటార్‌సైకిల్‌పై అలంపూరు వైపు వెళ్లాడు. తిరిగి రాత్రి వస్తుండగా మోటర్‌ సైకిల్‌ అదుపు తప్పి డీవైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లూథర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తాలుకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విక్రమసింహ తెలిపారు. 


ట్రాక్టర్‌ కిందపడి యువకుడి...

వెల్దుర్తి: మండల పరిధిలోని ఎల్‌ నగరం గ్రామానికి చెందిన మహమ్మద్‌ రఫీ(14) సోమవారం ట్రాక్టర్‌ కిందపడి మృతి చెందాడు. ఉదయం తమ పక్క పొలంలో రోటావేటర్‌తో సేద్యం చేస్తుండగా.. దానిపై కూర్చోవడానికి ప్రయత్నించి ప్రమాదవశాత్తు ట్రా క్టర్‌ క్రింద పడి మృతి చెందాడు. యువకుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 


Updated Date - 2021-01-12T05:48:31+05:30 IST