‘దళితులపై దాడులు చేసిన వారిని శిక్షించాలి’

ABN , First Publish Date - 2021-10-29T04:52:48+05:30 IST

నందికొట్కూరు పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌లో దళితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు స్వాములు, వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

‘దళితులపై దాడులు చేసిన వారిని శిక్షించాలి’
కేజీ రోడ్డుపై నిరసన తెలుపుతున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

నందికొట్కూరు, అక్టోబరు 28: నందికొట్కూరు పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌లో  దళితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు స్వాములు, వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం ముందు, కేజీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం టీడీపీ మాజీ కౌన్సిలర్‌ శాంతరాజు, నాగశేషులు అనే దళితులపై నందికొట్కూరు మున్సిపల్‌ చైర్మన్‌ సుధాక్‌రెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు శ్రీనివాసరెడ్డి మరికొందరు దాడి చేశారని అన్నారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అగ్రవర్ణాల పెత్తనం నియోజకవర్గంలో నశించాలని కోరారు. నందికొట్కూరు రూరల్‌  సీఐ ప్రసాద్‌, పోలీసులు వచ్చి నింధితులపై కేసులు నమోదు చేశామని, నిరసన విరమించాలని కోరారు. కార్యక్రమంలో సోము, శేషన్న, తిరుపతయ్య, నాగేంద్ర, మహే ష్‌, వెంకటేశ్ర్లు, ప్రమోద్‌, శ్రీను, విజయుడు, సుంకన్న, కళాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T04:52:48+05:30 IST