ఇది అసమర్థ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-09-03T05:11:30+05:30 IST

ఇది అసమర్థ ప్రభుత్వమని, దీనికి రాష్ట్రంలో పింఛన్ల తొలగింపే నిదర్శనమని టీడీపీ సీనియర్‌ నాయకుడు ఉలిగయ్య అన్నారు.

ఇది అసమర్థ ప్రభుత్వం

కౌతాళం,సెప్టెంబరు 2: ఇది అసమర్థ ప్రభుత్వమని, దీనికి రాష్ట్రంలో పింఛన్ల తొలగింపే నిదర్శనమని  టీడీపీ సీనియర్‌ నాయకుడు ఉలిగయ్య అన్నారు. మండలంలోని గోతులదొడ్డి గ్రామంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ చిన్న గ్రామమైన గోతులదొడ్డిలో 11 మందికి పింఛన్లు తొలగించారని అన్నారు. ఇలా ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో తొలగించారని అన్నారు. అధికారంలో రాగానే పింఛన్లు రూ.3 వేలు చేస్తామని చెప్పిన జగన్‌ ప్రభుత్వం దానికి భిన్నంగా పింఛన్లు తొలగిస్తోందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాష్ర్టాన్ని ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో నెట్టిందని అన్నారు. టీడీపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి అడివప్పగౌడ్‌, సురేష్‌ నాయుడు, రామలింగ, సిద్ధప్ప, గోవిందు, నగేష్‌, దుర్గయ్య, త్రిమూర్తులు, తిమ్మయ్య, హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T05:11:30+05:30 IST