చోరీలు.. కిడ్నాప్‌లు.. హత్యలు

ABN , First Publish Date - 2021-12-30T06:02:23+05:30 IST

ఈ ఏడాదిలో జిల్లాలో నేరాల సంఖ్య భారీగానే పెరిగింది. దొంగతనాలు, హత్యలు, కిడ్నాప్‌లు, సాధారణ ఘర్షణలు, అత్యాచారాలు గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి.

చోరీలు.. కిడ్నాప్‌లు.. హత్యలు

  1. 2021 సంవత్సరంలో పెరిగిన కేసులు
  2. సాంకేతికతో సైబర్‌ కేసుల ఛేదన
  3. అక్రమ మద్యం రవాణాపై కొరడా
  4. కొత్త బాస్‌ రాకతో నేరాల కట్టడి 
  5. పెద్ద ఎత్తున పోలీసులకు స్థానచలనం


కర్నూలు, డిసెంబరు 29: ఈ ఏడాదిలో జిల్లాలో నేరాల సంఖ్య భారీగానే పెరిగింది. దొంగతనాలు, హత్యలు, కిడ్నాప్‌లు, సాధారణ ఘర్షణలు, అత్యాచారాలు గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి. దొంగతనాలు గత ఏడాది 185 జరిగితే.. ఈ ఏడాది 199 జరిగాయి. కిడ్నాప్‌ కేసులు గత ఏడాది 44 ఉండగా.. ఈసారి 97 ఉన్నాయి. మహిళల హత్యలు గత ఏడాది 27 ఉండగా.. ఈ ఏడాది 31 జరిగాయి. మహిళల కిడ్నాప్‌లు గత ఏడాది 24 జరగ్గా.. ఈసారి 77కి పెరిగాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీసులు పలు కేసులను ఛేదించారు. జూన్‌ వరకు జరిగిన నేరాలతో పోలిస్తే.. తర్వాత సగం ఏడాది కాస్త సంఖ్య తగ్గుముఖం పట్టింది. పోలీస్‌ శాఖకు కొత్త బాస్‌ వచ్చిన తర్వాత అవినీతి పోలీసుల్లో వణుకు మొదలైంది. కౌంటర్‌ కేసుల నమోదు తగ్గాయి. జిల్లాలో ఈ ఏడాది జరిగిన నేరాలపై ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. 


పోలీసులు ఛేదించిన కేసులు


27 కేసుల్లో దొంగతనాలకు పాల్పడిన రెండు ముఠాలకు చెందిన ఏడుగురికి అరెస్టు చేసి రూ.1.34 కోట్లు సొమ్మును రికవరీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సైబర్‌ నేరాలకు పాల్పడిన ముగ్గురు నైజేరియన్లను, మణిపూర్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు.

ఏపీ, తెలంగాణతో పాటు ఏడు రాష్ట్రాలకు నకిలీ కొబ్బెరనూనె, టీపౌడర్‌ ప్యాకెట్లను తయారు చేసి సరఫరా చేస్తున్న ముఠాను కర్నూలు పోలీసులు గుట్టు రట్టు చేశారు.

కాల్‌ గల్స్‌ పేరుతో వీడియో కాల్స్‌ చేసి మోసం చేస్తున్న ఇద్దరిని కర్నూలు వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

నల్లమల పారెస్టు నుంచి హైదరాబాదుకు ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

రైస్‌ పుల్లింగ్‌ పేరుతో ఏడు రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడిన ముఠాను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. 

మహిళల ఫొటోలు, వీడియోలు సేకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న 20 మందిని అరెస్టు చేశారు. 


ఎస్‌ఈబీ కేసులు ఇలా


ఈ ఏడాది అక్రమ మద్యం రవాణా అరికట్టేందుకు పోలీసులు గట్టిగానే చర్యలు తీసుకున్నారు. నాటుసారా తయారీ కేసుల్లో 5,040 కేసులు నమోదు చేసి 4675 మందిని అరెస్టు చేశారు. 84,079 లీటర్ల నాటుసారాను సీజ్‌ చేశారు. 18,36,860 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నల్లబెల్లం అక్రమ రవాణా కేసుల్లో 24 వాహనాలను సీజ్‌ చేసి 52 మందిని అరెస్టు చేశారు. 48,339 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌టీపీఎల్‌లో 3,235 కేసులు నమోదు చేసి 4898 మందిని అరెస్టు చేశారు. ఇసుక అక్రమ రవాణాపై 662 కేసులు నమోదు చేసి 1309 మందిని అరెస్టు చేశారు. 821 వాహనాలు సీజ్‌ చేసి.. 12,039 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. 


కేసుల చిట్టా ఇది


కేసుల వివరాలు 2020 2021

ఇంటి దొంగతనాలు 185 199

హత్యలు 73 86

కిడ్నాప్‌లు 44 97

అత్యాచారాలు 59 66

బలమైన గాయం 

కలిగించే కేసులు 43 36

హత్యాప్రయత్నాలు 184 149

మహిళను

హింసించి హత్య 02 01

వరకట్న చావులు 09 07

ఆత్మహత్యకు ప్రేరణ 39 34

గృహ హింస 609 612

మహిళ హత్యలు 27 31

మహిళా కిడ్నాప్‌లు 24 77

మహిళను అవమాన

 పరుచుట 426 431

ఎర్ర చందనం

 కేసులు 05 04

ఎన్‌డీపీఎల్‌ కేసులు 592 1976

ఎక్సైజ్‌ కేసులు 483 2093

నిర్లక్ష్యంగా వ్యవహరించి 

ప్రాణాలు తీసే 

కేసులు 556 626

Updated Date - 2021-12-30T06:02:23+05:30 IST