అయ్యలూరులో చోరీ

ABN , First Publish Date - 2021-10-20T05:20:40+05:30 IST

నంద్యాల మండలం అయ్యలూరు గ్రామంలో మంగళవారం ఓ ఇంట్లో చోరీ జరిగింది.

అయ్యలూరులో చోరీ

నంద్యాల(నూనెపల్లె), అక్టోబరు 19: నంద్యాల మండలం అయ్యలూరు గ్రామంలో మంగళవారం ఓ ఇంట్లో చోరీ జరిగింది. రైతు ముల్లా మహమ్మద్‌ ఓ పనినిమిత్తం మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళుతూ తలుపులకు తాళాలు వేయకుండా గొల్లెం పెట్టి వెళ్లారు. పని పూర్తి చేసుకొని తిరిగి రాగా ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించారు. తాలుకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. ఇంట్లో ఉన్న 5 తులాల బంగారు నగలు, 30 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితుడు పేర్కొన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Updated Date - 2021-10-20T05:20:40+05:30 IST