సి.క్యాంపు రైతుబజార్‌లో దొంగతనం
ABN , First Publish Date - 2021-11-29T05:03:53+05:30 IST
కర్నూలు నగరంలోని సి.క్యాంపు రైతుబజార్‌లో ఆదివారం ఓ మహిళ రూ.1600లతో పాటు, సెల్‌ఫోన్‌ను తస్కరించి అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేస్తుండగానే ఎస్టేట్ అధికారిణి కళ్యాణమ్మ, సెక్యూరిటీ గార్డులు గురువయ్య, గోపాల్, గురుమూర్తి తదితరులు చాకచక్యంగా పట్టుకుకున్నారు.

కర్నూలు(అగ్రికల్చర్), నవంబరు 28: కర్నూలు నగరంలోని సి.క్యాంపు రైతుబజార్‌లో ఆదివారం ఓ మహిళ రూ.1600లతో పాటు, సెల్‌ఫోన్‌ను తస్కరించి అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేస్తుండగానే ఎస్టేట్ అధికారిణి కళ్యాణమ్మ, సెక్యూరిటీ గార్డులు గురువయ్య, గోపాల్, గురుమూర్తి తదితరులు చాకచక్యంగా పట్టుకుకున్నారు. నగదు, సెల్‌ఫోన్‌లను బాధితులకు అందజేశారు. ఆ మహిళను హెచ్చరించి వదిలేశారు. ఎస్టేట్ అధికారి కళ్యాణమ్మ మాట్లాడుతూ రెండు, మూడు నెలలుగా రైతుబజార్‌లో దొంగలు ప్రవేశించి రైతులు, పొదుపులక్ష్మి మహిళలు కూరగాయలు అమ్ముకునే సమయంలో వారిని ఏమార్చి డబ్బుతో పాటు సెల్‌ఫోన్లను దొంగిలిస్తున్నారని, వీరిని అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు గుర్తించిన చిల్లర దొంగల ఫోటోలను రైతుబజార్‌లో ఏర్పాటు చేస్తే దొంగలను నివారించేందుకు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజలతో పాటు కూరగాయలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులు, మహిళలు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని కళ్యాణమ్మ విజ్ఞప్తి చేశారు.