ప్రపంచంలోనే పటిష్ఠ రాజ్యాంగం
ABN , First Publish Date - 2021-11-27T05:27:16+05:30 IST
భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్టమైనదని నంద్యాల ఇన్చార్జి ఆర్డీవో మల్లికార్జునుడు అన్నారు.

- ఇన్చార్జి ఆర్డీవో మల్లికార్జునుడు
నంద్యాల(నూనెపల్లె), నవంబరు 26: భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్టమైనదని నంద్యాల ఇన్చార్జి ఆర్డీవో మల్లికార్జునుడు అన్నారు. శుక్రవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఇన్చార్జి ఆర్డీవో మల్లికార్జునుడు, డీవైఎ్సవో ఆల్లీపీరా, డీఐ రవీంద్రపాల్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, కొలిమిగుండ్ల తహసీల్దార్ షేక్ మోహిద్దీన్, డిప్యూటీ తహసీల్దార్లు, విద్యార్థి సంఘం నాయకులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మల్లికార్జునుడు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటూ దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించుకుందామని పిలుపునిచ్చారు. నంద్యాల ఎన్జీవో్స కాలనీలో ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భవిష్యత్ తరాలకు రాజ్యాంగం ద్వారా దిశా నిర్దేశం చేసిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని కౌన్సిల్ నంద్యాల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మౌలాన అబ్దుల్ రహిమాన్, గౌస్ అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఉస్మాన్బాషా, అబ్దుల్ మజీద్, ఖాన్, జావీద్, మస్తాన్ పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: రాజ్యాంగంలోని ప్రవేశికకు అందరూ కట్టుబడి ఉండాలని జిల్లా అదనపు ఐదో జడ్జి అమ్మన్నరాజా పిలుపునిచ్చారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ న్యాయవాదులతో రాజ్యాంగ దినోత్సవాన్ని శుక్రవారం జరుపుకున్నారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశికను అందరితో ప్రతిజ్ఞ చేయించారు. సీనియర్ సివిల్ జడ్జి శివశంకర్, జూనియర్ సివిల్ జడ్జి శైలజ, ప్రభుత్వ న్యాయవాదులు షడ్రక్, ప్రభాకరరెడ్డి, సోమశేఖరరెడ్డి, న్యాయవాదులు మురళీధర్గౌడు, ఓబులేసు పాల్గొన్నారు.
పాణ్యం: అణగారిన వర్గాల కోసమే రాజ్యాంగం నిర్మాణమైందని మాలమహానాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు కోయిల రంగమ్మ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాలమహానాడు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీ, మైనార్టీ, ఉన్నత కులాలకు చెందిన సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన పేద వర్గాల కోసమే రాజ్యాంగాన్ని అంబేడ్కర్ రచించారన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు, ఎమ్మార్పీఎస్, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, ఆర్వీఎఫ్ నాయకులు దేవదత్తు, భాస్కర్, వెంకటాద్రి, సామేల్, ప్రతాప్, మునెమ్మ పాల్గ్గొన్నారు.
రుద్రవరం: వజ్రాయుధం లాంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారతదేశ ప్రజలకు అందించారని ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రుద్రవరం ఆదర్శ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఖలీల్ అహ్మద్ రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దొర్నిపాడు: మండలంలోని దొర్నిపాడు బాలుర వసతి గృహంలో శుక్రవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వార్డెన్ చంద్రశేఖర్రెడ్డి, సిబ్బంది బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
శిరివెళ్ల: భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమని యర్రగుంట్ల గంగుల తిమ్మారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు, షెడ్యూళ్లు తదితర వాటి గురించి ప్రిన్సిపాల్ విద్యార్థులకు వివరించారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు మౌలాలి, గోపాలరావు, కృష్ణమూర్తి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.