పొదుపు ఉద్యమ స్ఫూర్తి ప్రశంసనీయం

ABN , First Publish Date - 2021-07-08T05:43:13+05:30 IST

పొదుపు ఉద్యమ స్ఫూర్తి ప్రశంసనీయమని ట్రైనీ కలెక్టర్‌ నూరుల్లా అన్నారు.

పొదుపు ఉద్యమ స్ఫూర్తి ప్రశంసనీయం

  1. ట్రైనీ కలెక్టర్‌ నూరుల్లా 


ఓర్వకల్లు, జూలై 7: పొదుపు ఉద్యమ స్ఫూర్తి ప్రశంసనీయమని ట్రైనీ కలెక్టర్‌ నూరుల్లా అన్నారు. బుధవారం మండలంలోని ఉయ్యాలవాడ గ్రామంలో పొదుపుసంఘాల పనితీరుపై ఆయన సమీక్షించారు. అంతకుముందు ఆయనకు పొదుపు మహిళలు ఘన స్వాగతం పలికారు. నెలకు రూ.30 పొదుపు చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందామని పొదుపు మహిళలు వివరించారు. పాలవెల్లి, జీవనజ్యోతి, భూమి కొనుగోలు పథకాలపై వివరించారు. ఆయన వెంట డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు, ఏపీడీ వసుధ రెడ్డి, ఏపీఎం లక్ష్మీకాంతరెడ్డి ఉన్నారు. 


Updated Date - 2021-07-08T05:43:13+05:30 IST