చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-07-24T05:41:36+05:30 IST

మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన గుర్రం మల్లేష్‌(30) కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రుద్రవరం, జూలై 23: మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన గుర్రం మల్లేష్‌(30) కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఎస్‌ఐ రాజకులాయప్ప తెలిపిన వివరాల మేరకు.. మల్లేష్‌ భార్యతో గొడవపడి మనస్తాపానికి గురై ఈనెల 21వ తేదీ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు చికిత్స నిమి త్తం ఆళ్లగడ్డకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి తల్లి కళావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.Updated Date - 2021-07-24T05:41:36+05:30 IST