విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-20T04:58:17+05:30 IST

మండలంలోని క్రిష్ణాపురం గ్రామంలో షేక్‌ మహమ్మద్‌ ఇస్మాయిల్‌ (40) అనే వ్యక్తి ఆదివారం విద్యుదా ఘాతంతో మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి


ఆత్మకూరు(రూరల్‌, డిసెంబరు 19: మండలంలోని క్రిష్ణాపురం గ్రామంలో షేక్‌ మహమ్మద్‌ ఇస్మాయిల్‌ (40) అనే వ్యక్తి ఆదివారం విద్యుదా ఘాతంతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌   తన ఇంట్లోని బాత రూం కోసం కూలీలతో ఓ గుంతను తవ్వించాడు. కాగా ఆ గుంతలో నీళ్లు ఊరడంతో అతను ఓ విద్యుత మోటర్‌తో ఆ నీటిని తొలగించేందుకు మోటర్‌ను ఆన చేస్తుండగా షాక్‌కు గురై కుప్పకూలి పోయాడు. దీంతో హుటా హుటిన స్థానికులు ,కుటుంబ సభ్యులు  ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు.


Updated Date - 2021-12-20T04:58:17+05:30 IST