కొట్టం దగ్ధం

ABN , First Publish Date - 2021-03-25T05:21:38+05:30 IST

శ్రీశైలంలోని చెంచు కాలనీ మేకలబండలో నివాసముంటున్న డి. గుర్రప్ప కొట్టంలో బుధవారం రాత్రి గ్యాస్‌ సిలిండర్‌ పేలింది.

కొట్టం దగ్ధం


  శ్రీశైలం, మార్చి 24: శ్రీశైలంలోని చెంచు కాలనీ మేకలబండలో నివాసముంటున్న డి. గుర్రప్ప కొట్టంలో బుధవారం రాత్రి  గ్యాస్‌ సిలిండర్‌ పేలింది.  దీంతో కొట్టం పూర్తిగా కాలిపోయింది.  భార్య వంట చేసుకొనేటప్పుడు గ్యాస్‌ లీకయ్యి ఇక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆమె బయటకు పరుగులు తీసింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. 

Updated Date - 2021-03-25T05:21:38+05:30 IST