విద్యుత్‌ శాఖపై రైతు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-03-22T04:57:13+05:30 IST

విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 5 ఎకరాల్లో 450 చినీచెట్లు కాలిపోయాయని బాధిత రైతు వడ్డె పుల్లన్న సంజామల పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు.

విద్యుత్‌ శాఖపై రైతు ఫిర్యాదు


సంజామల, మార్చి 21:
విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 5 ఎకరాల్లో 450 చినీచెట్లు కాలిపోయాయని బాధిత రైతు వడ్డె పుల్లన్న సంజామల పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. మంగపల్లెలోని తన పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేయలేదని, దీంతో ఈ నెల 19న షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా నిప్పురవ్వలు పడటంతో గడ్డిలో మంటలు చెలరేగి, చినీ చెట్లు, పైపులైన్‌, మోటారు కాలిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు రూ.15 లక్షలు నష్టం జరిగిందని రైతు ఫిర్యాదు చేశాడ ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-03-22T04:57:13+05:30 IST