రేపు డీఈవో కార్యాలయం ముట్టడి

ABN , First Publish Date - 2021-11-01T05:27:02+05:30 IST

బోధనకు ఆటంకంగా ఉన్న యాప్‌లను రద్దు చేయాలని కోరుతూ నవంబరు 2న డీఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సనీల్‌రాజ్‌కుమార్‌, గిరిబాబు అన్నారు.

రేపు డీఈవో కార్యాలయం ముట్టడి

 ఆదోని(అగ్రికల్చర్‌), అక్టోబరు 31: బోధనకు ఆటంకంగా ఉన్న యాప్‌లను రద్దు చేయాలని కోరుతూ నవంబరు 2న డీఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సనీల్‌రాజ్‌కుమార్‌, గిరిబాబు అన్నారు. ఆదివారం యూటీఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధనకు గుదిబండగా మారిన యాప్‌ల భారాన్ని తొలగించి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. అందువల్ల నవంబరు 2న డీఈవో కార్యాలయాన్ని ముట్టడిం చాలని యూటీఎఫ్‌ రాష్ట్ర సంఘం పిలుపునిచ్చిందని తెలిపారు. జీవితా, పాపయ్య, గాదిలింగప్ప, రంగన్న, మల్లయ్య, నారాయణ, శేకన్న, శ్రీనివాసులు, పెద్దయ్య, రుద్రముని, సుధాకర్‌, శివకుమార్‌, లింగన్న, శ్రీకాంత్‌, జనార్ధన్‌, రాజహుసేన్‌, కృష్ణుడు, బసప్ప పాల్గొన్నారు.

Updated Date - 2021-11-01T05:27:02+05:30 IST