ఉపాధి కూలి చెల్లింపులో కులాల విభజన సరికాదు

ABN , First Publish Date - 2021-06-22T04:49:37+05:30 IST

ఉపాధి కూలీలను కులాల వారీగా విభజించి వేతనాలను చెల్లించడం సరైంది కాదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లింగన్న, మల్లయ్య అన్నారు.

ఉపాధి కూలి చెల్లింపులో కులాల విభజన సరికాదు
ఎంపీడీవో సూర్యనారాయణకు వినతి పత్రం అందజేస్తున్న నాయకులు

కౌతాళం, జూన్‌ 21: ఉపాధి కూలీలను కులాల వారీగా విభజించి వేతనాలను చెల్లించడం సరైంది కాదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లింగన్న, మల్లయ్య అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. పని చేసిన పద్నాలుగు రోజుల్లో వేతనాలు చెల్లించాలని నిబంధనలు ఉన్నప్పటికీ కులాల వారీగా చెల్లింపులేంటని ప్రశ్నించారు. అనంతరం ఎంపీడీవో సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. 

-పెద్దకడబూరు: పాత పద్ధతిలోనే ఉపా ధి కూలీలకు వేతనాలు చెల్లించాలని రైతు సంఘం నాయకులు భాస్కర్‌ యాదవ్‌, తిక్క న్న, పరమేష్‌, వీరేష్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో జూ నియర్‌ అసిస్టెంట్‌కు వినతి పత్రం అందజే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రతి ఉపాధి కూలీకి 18 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, రోజువారి కూలి రూ.600 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు హనుమంతు, మురళి, విరుపాక్షి పాల్గొన్నారు.

కోసిగి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు గతంలో మాదిరి ఒకేసారి వేతనాలు చెల్లించాలని సీఐ టీయూ మండల కార్యదర్శి రాముడు అన్నారు. 2005 సంవత్సరం నుంచి నేటి వరకు ఉపాఽధీ హామీ పథకంలో అన్నదమ్ముల్లా పని చేస్తున్న కూలీల మధ్య కులాల చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఉపాది కూలీలకు నిత్యావసర సరుకులతో పాటు రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. అనంతరం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో భక్తవత్సలంకు వినతి పత్రం అందిం చారు. కార్యక్రమంలో సిద్దప్ప, నాగేంద్ర, శ్రీనివాసులు, హనుమంతు పాల్గొన్నారు. 

మంత్రాలయం: పరమాన్‌దొడ్డి తండాకు చెందిన ఉపాధి కూలీల వేతనాలను సక్రమంగా చెల్లించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం మాలపల్లి గ్రామంలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద ధర్నా చేశారు. భాస్కర్‌ యాదవ్‌ మాట్లాడుతూ అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపించారు. 

Updated Date - 2021-06-22T04:49:37+05:30 IST