ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లిన బైక్
ABN , First Publish Date - 2021-12-16T04:56:52+05:30 IST
ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఓ బస్సు కిందకు బైక్ దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

ఆత్మకూరు, డిసెంబరు 15: ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఓ బస్సు కిందకు బైక్ దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం బస్టాండ్‌లోకి ఓ ఆర్టీసీ బస్సు వెళ్లే క్రమంలో పాములపాడుకు చెందిన ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా ఎదురొచ్చాడు. తన బైక్‌ను అదుపు చేసుకోలేక బస్సు కిందకు దూసుకెళ్లాడు. బస్సు డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్‌ను నెమ్మదిగా బయటకు తీశారు.