శరన్నవరాత్రులు ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-08T04:39:11+05:30 IST

దేవీశరన్నవరాత్రుల వేడుకలు ఆత్మకూరు పట్టణంలో గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

శరన్నవరాత్రులు ప్రారంభం
నెహ్రూనగర్‌లో దుర్గా మాతకు పూజలు నిర్వహిస్తున్న భక్తులు

ఆత్మకూరు, అక్టోబరు 7: దేవీశరన్నవరాత్రుల వేడుకలు ఆత్మకూరు పట్టణంలో గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవాసవి కన్యకాపరమేశ్వరీదేవి అమ్మవారు మహాగౌరీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. కాగా కిషన్‌సింగ్‌ వీధిలో దుర్గాదేవీ విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవికి విశేష పూజలు నిర్వహించి అనంతరం శాస్రోక్తంగా నిమజ్జనం గావించనున్నారు. 

- వెలుగోడు మండలంలోని ఆయా గ్రామాల్లోని అన్ని ఆలయాల్లో గురువారం దేవీశరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా ఆలయాలను విద్యుత్‌, పుష్పాలంకరణతో తీర్చిదిద్దారు. అలాగే దేవతామూర్తులకు వి శేష పూజలు నిర్వహించారు. వెలుగోడులోని వాసవీమాత ఆలయంలో అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 

ఆత్మకూరు రూరల్‌: మండల పరిధిలోని వెంకటాపురంలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలను గురువారం ప్రారంభించారు. ఆలయంలోని రాజరాజేశ్వరి మాతకు ముందుగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అంతకుముందు కలశ పూజ, గణపతి పూజ లక్ష్మీపూజ, పుణ్యహవచనం తదితర పూజలు నిర్వహించారు. అలాగే కురుకుంద, కరివేన గ్రామాల్లో నవరాత్రి వేడుకల్లో భాగంగా విశేష పూజలు నిర్వహించారు.

మిడుతూరు: శ్రీదేవి శరన్నవరాత్రులు సందర్భంగా తొమ్మిది రోజులపాటు మాతా దుర్గా దేవిని రోజుకో అవతారంలో భక్తులు కొలుస్తారు. మండల కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గురువారం అమ్మవారు భక్తులకు బాలా త్రిపుర సుందరి గా దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చ నతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్‌ భూమా క్రిష్ణ మోహన్‌, కటకం వెంకటేశ్వర్లు, దొంతు క్రిష్ణ మూర్తి, సత్య నారాయణ పాల్గొన్నారు.

పగిడ్యాల: దసరా పండుగ సందర్భంగా మండల పరిధిలోని నెహ్రూనగర్‌ గ్రామంలో గురువారం దేవీ నవరాత్రులు ప్రారంభమ య్యాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహం ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహిసు ్తన్నారు. మొదటి రోజు అమ్మవారు బాలత్రీపు రా సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు.

కోవెలకుంట్ల: కోవెలకుంట్ల పట్టణంలోని మెయిన్‌ బజారులో వెలిసిన అమ్మవారి శాలలో వాసవీమాత గురువారం దసరా శరన్నవ రాత్రుల్లో భాగంగా మొదటి రోజు రాజరాజే శ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్యులు, భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పట్ట ణానికి చెందిన సముద్రాల దీక్షిత తన మొదటి నెల వేతనం రూ.30వేలు అమ్మవారి ఆలయానికి విరాళంగా అందించారు.  

కొలిమిగుండ్ల: కొలిమిగుండ్ల మండలంలోని తిమ్మనాయునిపేట గ్రామంలో వెలిసిన వాసవీమాత దేవాలయంలో దసరా ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం రాజరాజేశ్వరీదేవి అలంకారంలో వాసవీమాత భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామానికి చెందిన గణా చారి నాగిశెట్టి కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్ర మంలో రమేష్‌శెట్టి, సుధాకర్‌శెట్టి, శేషఫణిశెట్టి, బాలసు బ్రమణ్యంశెట్టి పాల్గొన్నారు.  

బనగానపల్లె: మండలంలోని నందవరం శ్రీచౌడేశ్వరీమాత అమ్మవారు గురువారం శైలపుత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమి చ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈవో రామా నుజన్‌, ఆలయ చైర్మన్‌ పీఆర్‌ వెంకటేశ్వరరెడ్డి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని కొండపేటలో వెలసిన వాసవీమాత అమ్మవారు స్వర్ణకవ చాలంకృతదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శివచంద్రయ్య ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు

Updated Date - 2021-10-08T04:39:11+05:30 IST