రైతుల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్సీ
ABN , First Publish Date - 2021-05-05T05:42:29+05:30 IST
రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి పేర్కొన్నారు.

అవుకు, మే 4: రైతుల
సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి
పేర్కొన్నారు. మంగళవారం అవుకు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన
జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ
మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కొనుగోలు
కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. హైబ్రిడ్ రకానికి చెందిన జొన్నలు
క్వింటం రూ. 1850, మహేంద్ర రకం జొన్నలు క్వింటం రూ. 2620 ప్రకారం కొనుగోలు
చేస్తారన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీఏ క్రిష్ణమోహన్‌రెడ్డి,
తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఆజాంఖాన్, వెలుగు ఏపీఎం జ్యోతి,
ఇన్‌చార్జి వ్యవసాయాధికారి సురే్‌షరెడ్డి, ఈవోఆర్డీ మహిధర్‌రెడ్డి,
డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్‌బాబు, ఈవో బాలాంజినేయులు పాల్గొన్నారు.