పరీక్షలను రద్దు చేయాలి: టీడీపీ

ABN , First Publish Date - 2021-06-22T05:17:03+05:30 IST

పది, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కోట్ల సుజాతమ్మ, గౌరు చరితారెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు ఎంవీఎన్‌ రాజుయాదవ్‌ తదితరులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పరీక్షలను రద్దు చేయాలి: టీడీపీ

కర్నూలు(ఎడ్యుకేషన్‌)/అగ్రికల్చర్‌, జూన్‌ 21: పది, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కోట్ల సుజాతమ్మ, గౌరు చరితారెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు ఎంవీఎన్‌ రాజుయాదవ్‌ తదితరులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డికి సోమవారం వారు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం పది, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిందని, ఇతర రాష్ట్రాల్లో కూడా పరీక్షలను రద్దు చేశారని గుర్తు చేశారు. ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం మొండిగా చెబుతోందని అన్నారు. కొవిడ్‌ భయం కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్ష కేంద్రాలకు పంపేందుకు ఆందోళన చెందుతున్నారని అన్నారు. విద్యార్థుల ప్రాణాల కంటే పరీక్షలు ముఖ్యం కాదని, ప్రభుత్వం వెంటనే పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్‌, నాయకులు నాగేంద్రకుమార్‌, పోతురాజురవి కుమార్‌, ఆకేపోగు ప్రభాకర్‌, జేమ్స్‌, సత్రం రామకృష్ణుడు, రెడ్డిపోగు బజారన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:17:03+05:30 IST