పరీక్షలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-05-02T06:08:51+05:30 IST

కరోనా విజృంభించి ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడం సరైనది కాదని, వెంటనే వాటిని రద్దు చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు.

పరీక్షలు రద్దు చేయాలి

  1. టీడీపీ పత్తికొండ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు


పత్తికొండ, మే 1: కరోనా విజృంభించి ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడం సరైనది కాదని, వెంటనే వాటిని రద్దు చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. శనివారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పరీక్షల నిర్వహిస్తే విద్యార్థులతో పాటు నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది కరోనా బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. ఓ వైపు ఆక్సిజన్‌, మరో వైపు ఆసుపత్రులలో బెడ్లు లేక రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి తుగ్లక్‌లా ప్రవర్తిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటిస్తున్నారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తేందుకు కరోనా అడ్డం వచ్చిన ముఖ్యమంత్రికి విద్యార్థుల ప్రాణాలు పట్టవా? అని శ్యాంబాబు ప్రశ్నించారు.

Updated Date - 2021-05-02T06:08:51+05:30 IST