కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-11-03T05:29:11+05:30 IST

ప్రేమ పేరుతో అమాయకురాలైన దళిత యువతి ప్రాణాలు తీసిన యువకుడిని శిక్షించాలని కోరుతూ దళిత సంఘాల నాయకులు స్థానిక కలెక్టరేట్‌ ముందు మంగళవారం రస్తారోకో చేశారు.

కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత
రాస్తారోకో చేస్తున్న దళిత సంఘాల నాయకులు

కర్నూలు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రేమ పేరుతో అమాయకురాలైన దళిత యువతి ప్రాణాలు తీసిన యువకుడిని శిక్షించాలని కోరుతూ దళిత సంఘాల నాయకులు స్థానిక కలెక్టరేట్‌ ముందు మంగళవారం రస్తారోకో చేశారు. దీంతో కలెక్టరేట్‌ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వెల్దుర్తి మండలానికి చెందిన యువతిని మాయ మాటలు చెప్పి తీసుకుపోయి, ఆమె మృతికి కారణమైన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని తగిన విధంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఆమెకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆపబోమని, దళిత ఆడబిడ్డ మృతికి కారణమైన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-03T05:29:11+05:30 IST