పది, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-06-22T04:53:40+05:30 IST

పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కర్నూలు జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షుడు రామాంజనేయులు, తేజ డిమాండ్‌ చేశారు.

పది, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలి
అధికారికి వినతిపత్రం ఇస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

ఆదోని, జూన్‌ 21: పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కర్నూలు జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షుడు రామాంజనేయులు, తేజ డిమాండ్‌ చేశారు. సోమవారం డీవో కార్యాలయం అధికారి లక్ష్మణ్‌దాస్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పది, ఇంట ర్‌ పరీక్షలు తక్షణమే రద్దు చేయాలని విద్యార్థుల ప్రాణాలతో చలగాటం ఆడడ మేనని దుయ్యబట్టారు. పరీక్షలు రద్దు చేసి, థర్డ్‌వేవ్‌ నుంచి విద్యార్థులను, ప్రజలను కాపాడాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్‌ గురించి ఆలోచన చేసే వారైతే వారికి మానసిక ఆందోళనకు గురి చేస్తారా అంటూ ప్రశ్నించారు. కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులకు మార్క్స్‌ సర్టిఫికెట్‌ బదులుగా డెత్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలనుకుంటున్నారా అని మండిపడ్డారు. కార్యక్ర మంలో జయసూర్య, తేజ, అభి, కమిటీ సభ్యులు సాయి, కిషోర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T04:53:40+05:30 IST