శిథిలావస్థలో ఆలయ దుకాణాలు

ABN , First Publish Date - 2021-12-30T05:30:00+05:30 IST

దేవదాయ శాఖకు చెందిన ఆంజనేయ స్వామి ఆలయ పరిధిలోని దుకాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

శిథిలావస్థలో ఆలయ దుకాణాలు
కూలడానికి సిద్ధంగా ఉన్న ఆలయ గదులు

  1. ఇబ్బందుల్లో వినియోగదారులు
  2. కరోనాలోనూ బాడుగల వసూలు


పాణ్యం, డిసెంబరు 30: దేవదాయ శాఖకు చెందిన ఆంజనేయ స్వామి ఆలయ పరిధిలోని దుకాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వం దేళ్ల కింద నిర్మించిన దుకాణాలకు మరమ్మతు పనులు చేయకపోవ డంతో కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో బార్బరు షాపులు, టీ హోటళ్లు, బట్టల దుకాణాలు, ఫ్యాన్సీ దుకాణాలు ఉన్నాయి. ఆలయ పాలక మండలి గాని, అధికారులుగాని  దుకాణాల బాగోగులు చూడడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. మూడేళ్లకోసారి దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ దుకాణాలకు వేలాలు నిర్వహిస్తారు. అయితే దుకాణాలు వేలంలో తీసు కున్న వ్యాపారుల సమస్యలను పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. గ్రామం నడిబొడ్డున ఉన్న ఆరు దుకాణాల ద్వారా ప్రతి నెల రూ.14,500 ఆదాయం వస్తున్నా వాటి మరమ్మతు గురించి దేవదాయ అధి కారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 


వర్షం వస్తే తడవాల్సిందే : వర్షం వస్తే దుకాణాల్లోని సరుకులు తడిసి నష్ట్టపోవాల్సి వస్తోంది. దుకాణాలకు వేసిన పైకప్పు దంతెలు దెబ్బతిని పో యాయి. జీవనాధారం కోసం దుకాణాలు తీసుకోవాల్సి వస్తోందని వ్యాపా రులు అంటున్నారు. ఆలయానికి ఆనుకొని ఉన్న అళ్వారు స్వామి దర్గాను పునర్నిర్మాణానికి పడగొట్టడంతో ఆలయ గోడలు పడిపోకుండా రక్షణగా ఇనుపకడ్డీలు ఉంచారు. అయితే ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. 


కరోనాలోనూ బాడుగలు వసూలు చేశారు 

 నెలకు రూ. 5500  బాడుగ చల్లిస్తున్నాం.  వర్షం వస్తే రూములు కారుతున్నాయి. కనీస సౌకర్యాలు లేవు.  పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. అయినా పట్టించుకోవడం లేదు.  కరోనా సమయంలో   ఎనిమిది నెలలు హోటల్‌ మూసివేశాను. 

- కరుణాంజనేయులు, టీ బంకు యజమాని, పాణ్యం


లాక్‌డౌన్‌ కాలాన్ని మినహాయించాలి 

 నెలకు రూ.2,700 బాడుగ చెల్లిస్తున్నాను. వర్షా కాలంలో బట్టలు తడిసి ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాం. లాక్‌డౌన్‌ సమయానికి మినహాయింపు ఇవ్వాలి రూములు శిథిలావస్థకు చేరుకున్నాయి. గదులు రిపేరీ చేయించాలి.   

- చంద్రశేఖర్‌, బట్టల వ్యాపారి, పాణ్యం



Updated Date - 2021-12-30T05:30:00+05:30 IST