5న హుండీ లెక్కింపు

ABN , First Publish Date - 2021-05-02T06:10:37+05:30 IST

మహదేవపురం గ్రామ శివార్లలో వెలసిన సర్వలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఈనెల 5న లెక్కిస్తున్నట్లు ఈవో జనార్ధన్‌, చైర్మన్‌ జయలక్ష్మమ్మ శనివారం తెలిపారు.

5న హుండీ లెక్కింపు

శిరివెళ్ల, మే 1: మహదేవపురం గ్రామ శివార్లలో వెలసిన సర్వలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఈనెల 5న లెక్కిస్తున్నట్లు ఈవో జనార్ధన్‌, చైర్మన్‌ జయలక్ష్మమ్మ శనివారం తెలిపారు. అలాగే భక్తులు స్వామి వారికి అందించిన మిశ్రమ బియ్యాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు డిపాజిట్‌ చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని అన్నారు. హుండీ లెక్కింపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయాభివృద్ధికి వినియోగిస్తామని అన్నారు. 


Updated Date - 2021-05-02T06:10:37+05:30 IST