రఘురామిరెడ్డికి కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2021-07-24T05:34:23+05:30 IST

కర్నూలు నగర మాజీ మేయర్‌ రఘురామిరెడ్డి (93) అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామమైన మీదివేములలో భారీ జనసందోహం మధ్య నిర్వహించారు.

రఘురామిరెడ్డికి కన్నీటి వీడ్కోలు
రఘురామిరెడ్డి అంతిమయాత్రలో తనయుడు ప్రభాకర్‌రెడ్డి

  1. కర్నూలు మాజీ మేయర్‌కు నివాళులర్పించిన అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు 


ఓర్వకల్లు, జూలై 23: కర్నూలు నగర మాజీ మేయర్‌ రఘురామిరెడ్డి (93) అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామమైన మీదివేములలో భారీ జనసందోహం మధ్య  నిర్వహించారు. అంతకుముందు కర్నూలు నగరంలోని ఆయన నివాసంలో రఘురామిరెడ్డి మృతదేహానికి బైరెడ్డి విష్ణువర్ధన్‌ రెడ్డి, బైౖరెడ్డి సిద్దార్థరెడ్డి తదితర  నాయకులు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం భౌతిక కాయాన్ని మండలంలోని మీదివేముల గ్రామానికి తరలించి కుమారులు జనార్దన్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు పెద్దఎత్తున తరలి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో భార్య సరోజమ్మ, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు, మిగతా కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అంత్యక్రియల్లో తహసీల్దార్‌ శివరాముడు, ఎంపీడీవో శివనాగప్రసాద్‌, సీఐలు శ్రీనాథ్‌ రెడ్డి, వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ మల్లికార్జున, నాయకులు చెన్నారెడ్డి, రంగనాథగౌడు, వెంగన్న, శంకర్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, రాజన్న, మండలంలోని నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.Updated Date - 2021-07-24T05:34:23+05:30 IST