కూరగాయలు పారబోసి నిరసన

ABN , First Publish Date - 2021-09-04T05:26:51+05:30 IST

కూరగాయలకు గిట్టుబాటు ధర అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ విమర్శించింది.

కూరగాయలు పారబోసి నిరసన

కూరగాయలకు గిట్టుబాటు ధర అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ విమర్శించింది. శుక్రవారం ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆ పార్టీ నాయకులు కూరగాయలు పారబోసి వినూత్నంగా నిరసన తెలిపారు. కూరగాయల రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జడ్పీ మాజీ చైర్మన్‌ రాజశేఖర్‌ ధ్వజమెత్తారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పుల వలయంలో చిక్కుకుపోయారన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాము, మధు, కృష్ణారెడ్డి, నాగమల్లి, రామమద్దిలేటి, రైతులు పాల్గొన్నారు.  - ఓర్వకల్లు

Updated Date - 2021-09-04T05:26:51+05:30 IST