ఉన్నత ప్రమాణలతో బోధన చేయండి: డీఈవో

ABN , First Publish Date - 2021-10-08T05:15:17+05:30 IST

ఉన్నత ప్రమాణాతో బోధన చేయాలని జిల్లా విద్యాధికారి రంగారెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని హైస్కూల్‌లో ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.

ఉన్నత ప్రమాణలతో బోధన చేయండి: డీఈవో

గడివేముల, అక్టోబరు 7: ఉన్నత ప్రమాణాతో బోధన చేయాలని జిల్లా విద్యాధికారి రంగారెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం ఆయన  మండల కేంద్రంలోని హైస్కూల్‌లో ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Updated Date - 2021-10-08T05:15:17+05:30 IST