టీడీపీ నిరసనలు
ABN , First Publish Date - 2021-10-21T04:55:07+05:30 IST
రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం, పట్టాభి ఇంటిపై దాడిని నిరసిస్తూ టీడీపీ బుధవారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ర్యాలీలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బంద్‌లో పాల్గొన్నారు. రాస్తారోకో కారణంగా పలుచోట్ల రవాణా స్తంభించిపోయింది. నాయకులు మాట్లాడుతూ దాడులు చేయడం సిగ్గుచేట్టు అని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. వైసీపీ నాయకుల రౌడీయిజం నశించాలంటూ నినాదాలు చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం ఆటవిక చర్య అని మండిపడ్డారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, అధికారం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోందని ఆరోపించారు. వైసీపీ రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని వదిలేసి టీడీపీ నాయకులు, కార్యాలయాలపై దాడులు చేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందని ఆరోపించారు. వైసీపీ బెదిరింపులకు భయపడబోమని, అరాచకాలు ఇలాగే కొనసాగితే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పలువురు టీడీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పలువురిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
కర్నూలు(రూరల్); అక్టోబరు 20: కర్నూలు మండలంలో టీడీపీ చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. పార్టీ మండల కన్వీనర్ బోయ వెంకటేష్‌నాయుడు, మైనార్టీ సెల్ నాయకులు సయ్యద్, బీసీ సెల్ నాయకుడు మునిస్వామి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గొందిపర్ల, దేవమాడ, ఈ.తాండ్రపాడు, పంచలింగాల, వసంతనగర్ తదితర గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యసంస్థలు, కార్యాలయాలను మూసివేయించారు. గ్రామాల్లో ర్యాలీలు చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు నాగరాజు, శివలింగప్రసాద్, వడ్డె భీమ, నెహ్రుకుమార్, రత్నం పాల్గొన్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ను పోలీసులు తెల్లవారుజామునే గృహనిర్బంధం చేశారు.
కర్నూలు (కల్చరల్): నగరంలోని 48వ వార్డు నేతాజీ సర్కిల్‌లో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. టీడీపీ నగర మాజీ అధ్యక్షుడు తిరుపాల్‌బాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నగర అధ్యక్షురాలు మీసాల సుమలత, లక్ష్మీకాంతమ్మ, మద్దమ్మ, నాగేంద్ర, లతీఫ్ పాల్గొన్నారు.
డోన్: పట్టణంలోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడు, పట్టణ అధ్యక్షుడు కోట్రికే ఫణిరాజ్, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధికార ప్రతినిధి విజయభట్టుతోపాటు పలువురి టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు మకాం వేశారు. పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌ను వెంకటనాయునిపల్లెలో హౌస్ అరెస్టు చేశారు. విజయభట్టు, శ్రీనివాసులు యాదవ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ కార్యదర్శి అభిరెడ్డిపల్లె గోవిందు, తాడూరు వెంకటరమణయ్య, ఆంజనేయగౌడు, వెంకటాపురం పెద్దయ్య, గోసానిపల్లె మల్లయ్య, శ్రీరాములు, మిద్దెపల్లి గోవిందు, ఎర్రగుంట్ల మాజీ సర్పంచ్ మద్దిలేటి, మహమ్మద్ రఫి తదితరుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పాతబస్టాండులో నిరసన చేపట్టిన టీడీపీ నాయకులను సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పత్తికొండరూరల్: పత్తికొండలో మార్కెట్‌యార్డు నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చిన రాస్తారోకో చేపట్టారు. నాలుగు స్తంభాల కూడలి దగ్గర సీఐ ఆదినారాయణరెడ్డి, ఎస్‌ఐ భూపాలుడు సిబ్బందితో టీడీపీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. పార్టీజిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డిని స్వగ్రామం పుచ్చకాయలమాడలోనే హౌస్ అరెస్టు చేశారు. నాయకులు లోక్‌నాథ్, తిరుపాలు, కడవల సుధాకర్, బీటీ గోవింద్, తిమ్మయ్యచౌదరి, రవీంద్రనాయక్, సింగం శీను, చెన్నంనాయుడు, శ్రీనివాసులుగౌడ్, తిరుమలేష్‌గౌడ్ పాల్గొన్నారు.
కోడుమూరు: కోడుమూరులో టీడీపీ నాయకులు ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రభాకర్, మండల కన్వీనర్ కోట్ల కవితమ్మ, మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సీబీ లత, టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కేఈ మల్లికార్జునగౌడ్, మాజీ సర్పంచ్ కేఈ రాంబాబు సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు హేమాద్రిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కేఈ రఘుబాబు, ఎలప్పనాయుడు, శేఖర్, మాబు, లక్ష్మయ్యశెట్టి పాల్గొన్నారు.
