పింఛన్ల తొలగింపుపై టీడీపీ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-09-04T05:23:40+05:30 IST

పింఛన్‌ తొలగిస్తే వృద్ధులు ఎలా బతకాలని టీడీపీ నాయకులు ప్రశ్నించారు.

పింఛన్ల తొలగింపుపై టీడీపీ ఆగ్రహం
గూడూరులో వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు

పింఛన్‌ తొలగిస్తే వృద్ధులు ఎలా బతకాలని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. చాలా మంది పింఛన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారని, ప్రభుత్వం అటువంటి వారి కడుపు కొట్టడం దారుణమని అన్నారు. శుక్రవారం నాయకులు ధర్నా చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఏ నెలకు ఆ నెల పింఛన్‌ కచ్చితంగా తీసుకోవాలని చెప్పడం సరికాదన్నారు. పాత విధానంలోనే పింఛన్‌ ఇవ్వాలన్నారు. టీడీపీ హయాంలో రెండు నెలలు పింఛన్‌ తీసుకోకపోయినా మూడో నెలలో కలిపి ఇచ్చారని గుర్తు చేశారు.  నెలకు రూ.3వేలు పింఛన్‌ ఇస్తామని ఎన్నికల సమయంలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 


డోన్‌, సెప్టెంబరు 3: డోన్‌ పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధికార ప్రతినిధి విజయభట్టు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకుడు గంధం శ్రీనివాస్‌, డోన్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, నాయకులు తాడూరు వెంకటరమణయ్య, చనుగొండ్ల శ్రీరాములు, హరిశంకర్‌గౌడు, మాజీ సర్పంచ్‌ ఆదినారాయణ, గోసానిపల్లె మల్లయ్య, ఎల్‌ఐసీ శ్రీరాములు, ఆవులదొడ్డి వెంకటేశ్వరరెడ్డి, సూర్యచంద్రగౌడు, ఉడుములపాడు ప్రవీణ్‌ రెడ్డి, నాగేంద్ర, బాలు పాల్గొన్నారు.


ప్యాపిలి:  తొలగించిన పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ నాయకులు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం సూపరిం టెండెంట్‌ కొండయ్యకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.  పార్టీ మండల అధ్యక్షుడు గండికోట రామసుబ్బయ్య, నాయకులు కాంతారెడ్డి, సుదర్శన్‌, వెంకటేష్‌, రామాంజ నేయులు, మద్దిలేటి, సుధాకర్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


పత్తికొండ: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద పింఛన్ల తొలగింపుపై నిరసన చేపట్టారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, టీఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకుడు అశోక్‌కుమార్‌, నాయకులు చల్లా రవీంద్రనాథ్‌చౌదరి, శ్రీనివాసులుగౌడ్‌, సుధాకర్‌, కాకర్ల లక్ష్మీనారాయణ, మీరా హుసేన్‌ పాల్గొన్నారు. 


మద్దికెర: మద్దికెరలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు ధర్నా చేశారు. అనంతరం ఎంపీడీవో నరసింహమూర్తికి వినతిపత్రాన్ని అందజేశారు. టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు శివప్రసాద్‌, గడ్డం రామాంజనేయులు, టీడీపీ నాయకులు అగ్రహారం మాలిగ శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ కృష్ణ, నాయకులు బొంబాయి సుధాకర్‌, భీమరాజు, చంద్రమోహన్‌, పెరవలి రామాంజులు, మల్లికార్జున, వీరశేఖర్‌ పాల్గొన్నారు. 


తుగ్గలి: తుగ్గలి ఎంపీడీవో కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు.  టీడీపీ మండల అధ్యక్షుడు తిరుపాలునాయుడు, మాజీ ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలు వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌యాదవ్‌, తెలుగుమహిళ అధ్యక్షురాలు ఈరమ్మ, సీనియర్‌ నాయకులు తిమ్మయ్యచౌదరి, లక్ష్మీనారాయణచౌదరి, వల్లె వెంకటేష్‌, సత్యప్రకాష్‌, సోమశేఖర్‌గౌడ్‌, శ్రీనివాసులుగౌడ్‌, రామునాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


వెల్దుర్తి: పింఛన్‌ తొలగించి సీఎం జగన్‌ అవ్వా తాతలను నిలువునా ముంచేశారని టీడీపీ మండల అధ్యక్షుడు బలరాం గౌడు అన్నారు. ఎంపీడీవో సుబ్బారెడ్డికి వినతి పత్రం అందజేశారు. టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ మహిళా సహాయ కార్యదర్శి నీరజాగౌడు, బుక్కాపురం ఈశ్వరరెడ్డి, గుంటుపల్లె వెంకట్రాముడు, వీరభద్రుడు, సుధాకర్‌గౌడు, రామక్రిష్ణ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 


క్రిష్ణగిరి: క్రిష్ణగిరిలో ఎంపీడీవో అన్వరా బేగంను ఆమె కార్యాలయంలో కలిసి టీడీపీ  నాయకులు వినతిపత్రం అందజేశారు. టీడీపీ కర్నూలు లోక్‌సభ కార్యనిర్వాహక కార్యదర్శి ఆలంకొండ నబీ సాహెబ్‌, మండల అధ్యక్షుడు కటారుకొండ మర్రి శ్రీరాములు, మండల కార్యదర్శి మాదాపురం గురుస్వామి, తెలుగు యువత మండల నాయకులు బొంతిరాళ్ళ మహమ్మద్‌ రఫి పాల్గొన్నారు.


కోడుమూరు: కోడు మూరులోని మండల పరిషత్‌ కార్యాలయానికి చేరుకొని టీడీపీ నాయకులు ఎంపీడీవో మంజులవాణికి వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ రాష్ట్ర మహిళ అధికారి ప్రతినిధి, మాజీ సర్పంచ్‌ సీబీలత, సర్పంచ్‌ భాగ్యరత్న టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్‌ కేఈ రాంబాబు, మాజీ సింగిల్‌విండో అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి, హేమాద్రిరెడ్డి, గోపాల్‌నాయుడు, రవీంద్రగౌడ్‌ పాల్గొన్నారు. 


గూడూరు: గూడూరులో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ఎల్‌.సుధాకర్‌ రెడ్డి, గజేంద్ర గోపాల్‌, నాయకులు విజయరాఘవరెడ్డి, దండు సుందర్‌రాజు, పెంచికలపాడు కృష్ణ, కౌన్సిలర్‌ రేమట సురేష్‌, గుడిపాడు విజయ భాస్కర్‌ రెడ్డి, చనుగొండ్ల రంగనాయకులు, తులసికృష్ణ, మన్నన్‌ బాషా, వడ్డే నగేష్‌, హనుమంతు, విజయకుమార్‌, బాబు, కోడుమూరు షాషావలి, సులేమాన్‌, పెంచికలపాడు చిన్నగిడ్డయ్య పాల్గొన్నారు.


సి.బెళగల్‌: సి.బెళగల్‌లో టీడీపీ నాయకులు ఈవోఆర్డీ సుమిత్రమ్మకు విన్నతి పత్రం అందజేశారు. తెలుగుయువత నాయకుడు తిరుమలేశు  మాట్లాడుతూ మండలంలో 50 మందికి పింఛన్‌ నిలిపివేయడం దారుణమన్నారు. నాయకులు నాగరాజు, తిమోతి, గోవర్ధన్‌, శేఖర్‌ ఉన్నారు. 


 కర్నూలు(రూరల్‌): మండలంలోని గొందిపర్ల, ఈ.తాండ్రపాడు గ్రామాల్లో పింఛన్లు తొలగించడం తీవ్ర అన్యాయమని టీడీపీ నాయకులు చెన్నకేశవులు, సయ్యద్‌ అన్నారు. శుక్రవారం కర్నూలు ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ అమరేంద్రకు వినతిపత్రం సమర్పించారు.  నాయకులు వెంకటేశ్వర్లు, భీమ, చిన్నరహంతుల్లా, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. 


కల్లూరు: కల్లూరు మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. టడీపీ నాయకులు మాట్లాడుతూ చెట్లమల్లాపురం గ్రామంలో ఒక అంగన్‌వాడీ టీచర్‌కు పింఛన్‌ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. అనంతరం పరిపాలనాధికారి చంద్రశేఖర్‌ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు డి.రామాంజనేయులు, తెలుగుమహిళ నంద్యాల లోక్‌సభ నాయకురాలు కె.పార్వతమ్మ, టీడీపీ నాయకులు ఎన్‌వీ రామకృష్ణ, బాలవెంకటేశ్వరరెడ్డి, పవన్‌, ఫిరోజ్‌, మాదేష్‌, తదితరులు పాల్గొన్నారు. 


కర్నూలు(అగ్రికల్చర్‌): పింఛన్‌ పాత పద్ధతిలోనే ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం కర్నూలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌ పథకాలను అమలు చేయలేక చతికిల పడ్డారన్నారు. లక్ష్మన్న, నరసింహులు, మనోహర్‌, రామక్రిష్ణ, ప్రసాద్‌, గోవిందు, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-09-04T05:23:40+05:30 IST