కోట్లను కలిసిన కార్యకర్తలు
ABN , First Publish Date - 2021-11-22T05:16:42+05:30 IST
మండలంలోని గోరంట్ల, అమడగుంట్లకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం టీడీపీ జాతీయ ఉపాధక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, కోట్ల సుజాతమ్మ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు.

కోడుమూరు(రూరల్), నవంబరు 21: మండలంలోని గోరంట్ల, అమడగుంట్లకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం టీడీపీ జాతీయ ఉపాధక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, కోట్ల సుజాతమ్మ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు. లద్దగిరిలోని నివాసంలో కోట్ల దంపతులను పూలమాలతో ఘనంగా సత్కరించారు. అలాగే మండల కన్వీనర్ కోట్ల కవితమ్మను నివాసంలో కలిసి సత్కరించారు. ఈ సందర్బంగా కోట్ల మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో గోరంట్ల, అమడగుంట్ల నాయకులు, కార్యకర్తలు వెంకటేశ్వర్లు, సుంకన్న, మాదన్న, గోపి, నరేష్, మనోహర్, నాయుడు, చిరంజీవి, మహేంద్ర, తిరుమలేష్, గిరిబాబు, యల్లాకృష్ణ, గిడ్డయ్య, మధు, వెంకటేష్, బజారి, సుధాకర్, అశోక్, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.