పనులు వేగవంతం చేయాలి: సబ్ కలెక్టర్
ABN , First Publish Date - 2021-07-24T05:35:37+05:30 IST
మండలంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు.

శిరివెళ్ల, జూలై 23: మండలంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శిరివెళ్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఆమె శుక్రవారం పర్యటించారు. కాదరబాదర గ్రామ సమీపంలో ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను, మాలమాగు వాగును, పంటలను పరిశీలించారు. శిరివెళ్లలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పలు కాలనీల ప్రజలు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం గుండంపాడు గ్రామ ఆర్బీకే, సచివాలయాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ఆమె వెంట ఇన్‌చార్జి తహసీల్దార్, ఎంపీడీవోలు మాధవ, సాల్మన్, వ్యవసాయాధికారి అబ్దుల్‌హక్, సర్వేయర్ సరిత, పంచాయతీరాజ్ డీఈ లక్ష్మీ నరసింహులు, కార్యదర్శి సుబ్బరాయుడు ఉన్నారు.