ఓటీ ఎస్‌ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-12-08T05:42:34+05:30 IST

ప్రభుత్వం ప్రవేశ పట్టిన ఓటీఎస్‌ను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోటేశ్వరావు సూచించారు.

ఓటీ ఎస్‌ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్‌

గోనెగండ్ల, డిసెంబరు 7: ప్రభుత్వం ప్రవేశ పట్టిన ఓటీఎస్‌ను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోటేశ్వరావు సూచించారు. గోనెగండ్ల మండలంలోని వేముగోడు, పెద్దనేలటూరు గ్రామాల్లో అధికార బృందంతో కలిసి కలెక్టర్‌ మంగళవారం పర్యటించారు. వేముగోడు, పెద్దనేలటూరు గ్రామాల్లో ఓటీఎస్‌ పథకం కింద డబ్బులు చెల్లించినవారికి  రిజిసే్ట్రషన పత్రాలను అంజేశారు. వేముగోడులో 25 మంది, పెద్దనేలటూరులో ఏడుగురు ఓటీఎస్‌ కింద రూ.10 వేల ప్రకారం చెల్లించారు. గ్రామాలలో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటీఎస్‌ ప్రయోజనాలను అర్హులకు వివరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ఇంటిపై రుణ మాఫీ కోసం ఓటీఎస్‌ కింద సొమ్ము చెల్లిస్తే సర్వహక్కులు లభిస్తాయని అన్నారు. తద్వారా ఇళ్లపై బ్యాంకు రుణాన్ని పొందవచ్చునని తెలిపారు. గ్రామంలోని సచివాల ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులలో చైతన్యం తీసుకువచ్చి ఓటీఎస్‌ కింద రూ.10 వేలు చేల్లించేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామకృష్టారెడ్డి, తహసీల్దార్‌ వేణుగోపాల్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

కలెక్టర్‌ దృష్టికి వాన నష్టాలు

ఆదుకోవాలని టీడీపీ నాయకుల వినతి 

  ప్రధాన రహదారులు, గ్రామాల్లోని  రోడ్లు   అకాల వర్షాలకు గుంతలు పడ్డాయని, వాటిని మరమ్మతు చేయించాలని టీడీపీ నాయకులు కలెక్టర్‌ కోటేశ్వరరావును కోరారు. పంటలను నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని విన్నవించారు. గోనెగండ్ల పర్యటనకు మంగళవారం వచ్చిన కలెక్టర్‌ను టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి కలసి వినతి పత్రం అందజేశారు. ఆంధ్రజ్యోతిలో మంగళవారం  ‘రోడ్డెక్కితే ప్రమాదం’ అన్న శీర్షీకన ప్రచురితమైన కథనాన్ని కలెక్టరుకు చూపించారు. ఎమ్మిగనూరు, కోడుమూరు రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని, వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని అన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. 


Updated Date - 2021-12-08T05:42:34+05:30 IST