ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టరు

ABN , First Publish Date - 2021-12-10T05:25:58+05:30 IST

గృహ రుణ విముక్తి పథకాన్ని సద్విని యోగం చేసుకోవాలని కలెక్టరు కోటేశ్వరరావు అన్నారు.

ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టరు
రుణ విముక్తి పత్రాలు అందజేస్తున్న కలెక్టరు

పాణ్యం, డిసెంబరు 9: గృహ రుణ విముక్తి పథకాన్ని సద్విని యోగం చేసుకోవాలని కలెక్టరు కోటేశ్వరరావు అన్నారు. మండలంలోని కొనిదేడులో గురువారం నిర్వహించిన ఓటీఎస్‌ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఓటీఎస్‌తో గృహ లబ్ధిదారులు పలు లాభాలు పొందవచ్చని అన్నారు. అధిక రుణం ఉన్నా రూ.10 వేలు మాత్రమే చెల్లించి తిరిగి బ్యాంకు రుణాలు పొందవచ్చని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బలవంతంగా రిజిస్ట్రేషన్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం అందించే అవకాశాన్ని అందరికీ తెలపడం తమ బాధ్యతని అన్నారు. ఈ సందర్భంగా 20 మందికి రుణ విముక్తి పత్రాలు అందజేశారు. కార్యక్ర మంలో జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, తహసీల్దారు రత్నరాఽధిక, ఎంపీడీవో దస్తగిరి, ఈఈ నాగరాజు, ఏఈ అన్వర్‌బాష, సర్పంచ్‌ సువార్తమ్మ, ఎంపీటీసీ రవిశేఖర్‌రెడ్డి, ఏఈ మహబూబ్‌బాషా, ఏపీవో విజయరాణి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-10T05:25:58+05:30 IST