మహానందిలో స్వామి అమ్మవార్ల కల్యాణం
ABN , First Publish Date - 2021-05-08T05:34:32+05:30 IST
మహానంది క్షేత్రంలో శుక్రవారం స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని వేదపండితులు ఏకాంతంగా నిర్వహించారు.

మహానంది, మే 7: మహానంది క్షేత్రంలో శుక్రవారం స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని వేదపండితులు ఏకాంతంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో వేదపండితులు రవిశంకర్అవధాని, నాగేశ్వరశర్మ, హానుమంతరాయశర్మలతోపాటు అర్చకులు శరభయ్యశర్మ, హారిశర్మ వేదమంత్రాలతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని జరిపారు. కరోనా ప్రభావంతో మహానందిలో సేవలన్నీ పరోక్షంగా నిర్వహిస్తామని టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు.