‘ఆ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయండి’

ABN , First Publish Date - 2021-12-20T04:58:54+05:30 IST

మహానంది దేవస్థానంలో అవినీతికి పాల్పడుతూ ఆలయ అదాయానికి గండి కొడుతున్న ఆ ఇద్దరు ఉద్యోగులను వెంటనే సస్పెండ్‌ చేయాలని బీజేపీ నంద్యాల పార్లమెంట్‌ ఇనచార్జి బుడ్డా శ్రీకాంతరెడ్డి డిమాండ్‌ చేశారు.

‘ఆ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయండి’

మహానంది, డిసెంబరు 19: మహానంది దేవస్థానంలో అవినీతికి పాల్పడుతూ ఆలయ అదాయానికి గండి కొడుతున్న ఆ ఇద్దరు  ఉద్యోగులను వెంటనే సస్పెండ్‌ చేయాలని  బీజేపీ నంద్యాల పార్లమెంట్‌ ఇనచార్జి బుడ్డా శ్రీకాంతరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం మహానంది దేవస్దానం కార్యాలయంలో ఆయన ఈవో మల్లిఖార్జునప్రసాద్‌ను కలిశారు.  ఆలయంలో పనిచేసే ఒక ఉన్నత ఉద్యోగి అవినీతికి పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆ ఉద్యోగిని వెంటనే సస్పెండ్‌ చేయాల న్నారు. అలాగే టెండర్‌ దారులు భక్తుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై ఈవో మాట్లాడుతూ ఇప్పటికే ఆ ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. తదుపరి చర్యల కోసం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపుతామన్నారు పూజసామగ్రి విక్రయ టెండర్ల పక్రియ పారదర్శకంగా ఆనలైన పక్రియ  ద్వారా జరిగిందని తెలిపారు.


Updated Date - 2021-12-20T04:58:54+05:30 IST